WhatsApp Music : వావ్.. ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ వాట్సాప్‌ స్టేటస్‌కు మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

WhatsApp Music : ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ మాదిరిగా వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌కు మ్యూజిక్ క్లిప్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ అందరికి అందుబాటులో ఉంది.

WhatsApp Music : వావ్.. ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ వాట్సాప్‌ స్టేటస్‌కు మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

WhatsApp Music

Updated On : March 29, 2025 / 5:45 PM IST

WhatsApp Music : వాట్సాప్ యూజర్లకు అదిరే అప్‌డేట్.. ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ ప్రొఫైల్ అప్‌డేట్‌లకు సౌండ్‌ట్రాక్‌లను యాడ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త అప్‌డేట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఫీచర్‌ మాదిరిగానే ఉంటుంది. వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌లకు అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలకు 24 గంటల పాటు మ్యూజిక్ క్లిప్‌ను యాడ్ చేయొచ్చు. ముఖ్యంగా, వాట్సాప్‌లోని టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్‌లు ఈ ఫీచర్‌కు సపోర్టు ఇవ్వవు. ఫోటో స్టేటస్‌లో 15 సెకన్ల వరకు సౌండ్‌ట్రాక్ ఉంటుంది. వీడియో స్టేటస్‌లో 60 సెకన్ల వరకు మ్యూజిక్ వినవచ్చు.

Read Also : Apple iPhone 16e : పండగ చేస్కోండి.. అతి తక్కువ ధరకే ఆపిల్ iPhone 16e.. లిమిటెడ్ డీల్.. డోంట్ మిస్..!

సాధారణంగా చాలామంది వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్ ద్వారా కుటుంబం, స్నేహితులతో తమ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇన్‌స్టా మాదిరిగా స్టేటస్‌కు మ్యూజిక్ క్లిప్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్ రిలీజ్ అయింది. రాబోయే వారాల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

కొత్త వాట్సాప్ ఫీచర్ ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇక్కడ ముఖ్యమైన తేడా ఉంది. స్టేటస్‌లో షేర్ చేసిన మ్యూజిక్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. అంటే.. మీ స్నేహితులు మాత్రమే మీ మ్యూజిక్ చూడగలరు అలాగే వినగలరు ముఖ్యంగా, వినియోగదారులు షేర్ చేసిన పాటలను వాట్సాప్ స్వయంగా వీక్షించలేదు.

వాట్సాప్ స్టేటస్‌కి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి? :

  • మీ వాట్సాప్ స్టేటస్‌కి మ్యూజిక్ యాడ్ చేసేందుకు ఈ కింది విధంగా ట్రై చేయండి.
  • వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
  • ‘Updates’ ట్యాబ్‌కు వెళ్లండి.
  • కొత్త స్టేటస్ కోసం ‘Add Status’ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  • గ్యాలరీ నుంచి ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి. ‘New’ క్లిక్ చేయండి.
  • ఎంచుకున్న తర్వాత టాప్‌‌లో కొత్త ‘మ్యూజిక్ ఐకాన్’పై ట్యాప్ చేయండి.
  • మ్యూజిక్ లైబ్రరీ నుంచి మీ ఫోటో లేదా వీడియోకు సౌండ్‌ట్రాక్‌ను ఎంచుకోండి.
  • మీకు అవసరమైతే మ్యూజిక్ స్టిక్కర్ లొకేషన్ కూడా అడ్జెస్ట్ చేయవచ్చు.
  • ఎంచుకున్న సాంగ్‌తో స్టేటస్ అప్‌డేట్‌ను పోస్ట్ చేయండి.

Read Also : Infinix Note 50x 5G : ఏఐ ఫీచర్లు భలే ఉన్నాయి.. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ అదుర్స్.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి..!

వాట్సాప్ మ్యూజిక్ లైబ్రరీలో లైసెన్స్ పొందిన ట్రాక్‌లు ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్‌ని పోలి ఉంటుంది. అంటే.. సాంగ్స్ లభ్యత అనేది లైసెన్సింగ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, వాట్సాప్ యూజర్లు తమ సొంత సాంగ్స్ యాడ్ చేసేందుకు అనుమతి లేదని గమనించాలి.