Infinix Note 50x 5G : ఏఐ ఫీచర్లు భలే ఉన్నాయి.. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ అదుర్స్.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి..!

Infinix Note 50x 5G Launch : ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్‌ కోసం భారత మార్కెట్లోకి ఏఐ ఫీచర్లతో సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ధర, ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

Infinix Note 50x 5G : ఏఐ ఫీచర్లు భలే ఉన్నాయి.. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ అదుర్స్.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి..!

Infinix Note 50x 5G Launch

Updated On : March 29, 2025 / 5:13 PM IST

Infinix Note 50x 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏఐ ఫీచర్లు, పెద్ద 5,500mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్, మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. సర్టిఫైడ్ MIL-STD-810H, డస్ట్, వాటర్ నిరోధకతకు IP64 రేటింగ్‌లతో వస్తుంది.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50x ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Google Pixel 9 : వావ్.. వండర్‌ఫుల్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9పై అద్భుతమైన డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇంకా ధర తగ్గాలంటే?

భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ధర :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ 6GB+128GB ధర రూ.11,499 కాగా, టాప్-ఎండ్ (8GB+128GB) వేరియంట్ ధర రూ.12,999కు పొందవచ్చు. ఏప్రిల్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5G ఫోన్ అమ్మకానికి రానుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ 6.67-అంగుళాల HD+LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 672 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ 4nm ప్రాసెసర్, 8GB వరకు (LPDDR4x) ర్యామ్, 128GB స్టోరేజ్ ద్వారా పవర్ అందిస్తుంది. XOS 15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 5500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఐపీ64 సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, సెకండరీ కెమెరాతో 4K క్వాలిటీ వీడియో రికార్డింగ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది.

Read Also : Apple iPhone 16e : పండగ చేస్కోండి.. అతి తక్కువ ధరకే ఆపిల్ iPhone 16e.. లిమిటెడ్ డీల్.. డోంట్ మిస్..!

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ ఏఐజీసీ (AIGC) పోర్ట్రెయిట్ మోడ్ (కెమెరాలో) ఏఐ వాల్‌పేపర్ జనరేటర్, ఏఐ నోట్, ఫోలాక్స్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఏఐ గ్యాలరీ, ఏఐ ఎరేజర్, ఏఐ కటౌట్, సెర్చ్ వంటి అనేక ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ రైటింగ్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, కాల్ అసిస్టెంట్, సోషల్ అసిస్టెంట్, సర్కిల్ టు సెర్చ్‌ను కూడా అందిస్తుంది.