పన్ను వేధింపులను ఎంతమాత్రం సహించం : ఆర్ధిక మంత్రి

  • Publish Date - February 1, 2020 / 08:29 AM IST

పౌర నేరాలను చట్టబద్ధం చేసేందుకు కంపెనీల చట్టంలో సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్రబడ్జెట్ 2020 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. కంపెనీల చట్టాన్ని సవరించనున్నట్టు తెలిపారు.

దీంతో ఈ చట్టంలో సవరణతో క్రిమినల్ లియాబిలిటీని తొలగించనున్నట్టు నిర్మల తెలిపారు. పన్ను వేధింపులకు ఎంతమాత్రం సహించేది లేదన్నారు. పౌరులకు సంబంధించి పన్ను వేధింపుల చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆమె చెప్పారు.

పన్ను వేధింపుల నుంచి పౌరులకు ఉపశమనం కలిగిలా పన్నుదారుల సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతో ట్యాక్స్ పేయర్ చార్టర్ అనేది ఒకచట్టంగా రూపు దాల్చనుంది. జాతీయ భద్రత అనేది ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా నిర్మల స్పష్టం చేశారు.

దేశంలో సులభంగా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహించేందుకు కంపెనీల చట్టాన్ని చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నామని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.