దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. దాదాపు ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఎల్ఐసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా..కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఎల్ ఐసీ వాటలను కూడా విక్రయించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
డిజ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరుతో వివిధ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల మూలధన సాయం చేస్తామని, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాలను కూడా విక్రయించనున్నట్టు తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి రూ.2.1 లక్షల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. లక్ష కోట్ల రూపాయల విశ్లేషకుల అంచనాలకు మించి ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.18, 094.59 కోట్లను ఉపసంహరించుకుంది.
ఎల్ఐసీ.. ఐపీఓ ఉపసంహరణ భాగంలోనే ఉందని, ప్రభుత్వం పెట్టబడులు పెట్టేందుకు ఈ ఉపసంహరణ పథకాన్ని తీసుకొస్తున్నట్టు ఎస్ సెక్యూర్టీస్ అమర్ అంబానీ తెలిపారు. ఇది రూ.1.35 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ అని ఆయన అన్నారు. ఎల్ఐసీలో ఐపీఓను పారదర్శకంగా చేయనున్నట్టు రైట్ హారిజన్స్ వ్యవస్థాపకులు, సీఈఓ అనిల్ రెగో తెలిపారు.