GST 2 0 Effect
GST 2.0 Effect : ప్రముఖ వాహన తయారీ సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా పండగ బొనాంజాను ప్రకటించాయి. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి కార్ల ధరలను భారీగా తగ్గించనున్నాయి. ఈ పండగ సీజన్ సమయంలో ముఖ్యంగా లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ అలాగే ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త జీఎస్టీతో ధరలను తగ్గించనున్నారు. ఈ పండుగ సీజన్‌లో జీఎస్టీ తగ్గింపుతో ఆటోమేకర్లు ఏయే కార్లపై ఎంత ధర తగ్గించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించేందుకు వాహనాల ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గించింది. ద్విచక్ర వాహన వినియోగదారులు ఫోర్ వీలర్ వాహనాలకు మారేలా కంపెనీ 8.5 శాతం జీఎస్టీ ప్రయోజనానికి అదనంగా చిన్న కార్ల ధరలను తగ్గించాలని నిర్ణయించింది.
ఎంట్రీ లెవల్ మోడల్ S ప్రెస్సో ధరలు రూ.1,29,600 వరకు తగ్గుతాయి. ఆల్టో K10 రూ.1,07,600 వరకు తగ్గుతాయి. సెలెరియో రూ.94,100 వరకు తగ్గుతాయి. వాగన్-ఆర్ రూ.79,600 వరకు, ఇగ్నిస్ రూ.71,300 వరకు తగ్గుతాయి. చిన్న కార్లనే కాకుండా, గ్రాంట్ విటారా, బ్రెజ్జాతో సహా SUV సెగ్మెంట్‌పై కూడా కంపెనీ ధరలను తగ్గించింది.
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలివే :
ఇతర మారుతి కార్ల ధరల తగ్గింపు :
SUV కార్ల ధరల తగ్గింపు :
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 22 నుంచి వరుసగా రూ. 75,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు తగ్గుతాయి. ముంబైకి చెందిన కంపెనీ కాంపాక్ట్ SUV పంచ్ ధర రూ. 85వేలు, నెక్సాన్ ధర రూ. 1.55 లక్షలు తగ్గుతాయి. మిడ్-సైజ్ మోడల్ కర్వ్ ధర కూడా రూ.65,000 తగ్గనుంది. కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీ కార్లలో హారియర్, సఫారీ ధరలు వరుసగా రూ.1.4 లక్షలు, రూ.1.45 లక్షల తగ్గనున్నాయి.
మహీంద్రా-మహీంద్రా ఇప్పటికే ప్యాసింజర్ వాహన రేంజ్‌పై రూ.1.56 లక్షల వరకు ధర తగ్గింపును ప్రకటించింది. కంపెనీ బొలెరో/నియో రేంజ్ ధరను రూ.1.27 లక్షలు, మహీంద్రా XUV3XO (పెట్రోల్) రూ.1.4 లక్షలు, మహీంద్రా XUV3XO (డీజిల్) రూ.1.56 లక్షలు, థార్ 2WD (డీజిల్) రూ.1.35 లక్షలు, థార్ 4WD (డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షలు తగ్గించింది.
హ్యుందాయ్ కార్లపై ధర వెర్నాలో రూ.60,640 నుంచి ప్రీమియం SUV టక్సన్‌లో రూ.2.4 లక్షల వరకు తగ్గింపు అందించనుంది. సెప్టెంబర్ 22 నుంచి హోండా కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధరలను రూ.95,500 వరకు, సిటీ ధరలను రూ.57,500 వరకు, ఎలివేట్ ధరలను రూ.58,400 వరకు తగ్గించనుంది.
అదేవిధంగా, కియా ఇండియా కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించనుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల ధరలను సోమవారం నుంచి రూ.3.49 లక్షల వరకు తగ్గించనుంది. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ బైక్‌లు, స్కూటర్‌ల ధర రూ.15,743 వరకు తగ్గనుంది. హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా మోడల్ రేంజ్ 350cc వరకు ధరలు రూ.18,800 వరకు తగ్గనున్నాయి.
లగ్జరీ కార్ల ధరలు తగ్గింపు :
సరసమైన కార్లతో పాటు లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. మెర్సిడెస్-బెంజ్ కూడా జీఎస్టీ 2.0 కింద రూ. 2 లక్షల (A-క్లాస్) నుంచి రూ. 10 లక్షల (S-క్లాస్) వరకు ధరల తగ్గింపును ప్రకటించింది. బీఎండబ్ల్యూ మోటార్ ఇండియా కూడా మినీ రేంజ్ సహా ఇండియా పోర్ట్‌ఫోలియో అంతటా రూ. 13.6 లక్షల వరకు ధరల తగ్గింపును ప్రకటించింది.
ఆడి కార్ మోడళ్లలో భారత్ మార్కెట్లో రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షలకు పైగా ధరల తగ్గింపును ప్రకటించింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇప్పటికే రూ. 4.5 లక్షల నుంచి రూ. 30.4 లక్షల వరకు వాహన ధరలను తగ్గించింది.
చౌకగా మారనున్న బైకులివే.. కొత్త ధరలు
సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చౌకగా బైక్‌లు లభించనున్నాయి. మోటార్ సైకిళ్ళు 29 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. 350cc కన్నా తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై పన్ను ప్రయోజనాలు అందిస్తోంది. గతంలో, ద్విచక్ర వాహన విభాగంపై ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 29 శాతం నుంచి 31 శాతం వరకు పన్ను విధించింది. ఇప్పుడు, ఈ రేటును 18 శాతానికి తగ్గించింది. కానీ,ఏయే బైక్‌లు చౌకగా మారనున్నాయో ఇప్పుడు చూద్దాం..
బజాజ్ :
హీరో :
హోండా :
రాయల్ ఎన్ ఫీల్డ్ :