GST Rate Cut : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. మధ్యతరగతికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి చౌకగా మారే వస్తువులివే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

GST Rate Cut

GST Rate Cut : మధ్యతరగతివారికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. ఇందులో నిత్యావసర వస్తువుల సేవలు చౌకగా మారుతాయి. ఆహారం, ఎలక్ట్రానిక్స్, వైద్య సామాగ్రి వంటి వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఏయే వస్తువుల (GST Rate Cut) ధరల తగ్గనున్నాయి.. ఏయే వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జీఎస్టీ కొత్త మార్పు ఏంటి? :
1. రెండు ప్రధాన శ్లాబులు : జీఎస్టీ రెండు ప్రధాన (5శాతం, 18శాతం) రేట్లతో సవరించారు.
2. ప్రత్యేక స్లాబ్ : పొగాకు, ఆల్కహాల్, ఎరేటెడ్ పానీయాలు మొదలైన వస్తువులపై 40శాతం జీఎస్టీ వర్తింపు

రేపటి నుంచి ఏయే వస్తువులు చౌకగా దొరుకుతాయంటే? :

ఆటోమొబైల్స్, ఏయే ఎలక్ట్రానిక్స్, డివైజ్‌లు, కిచెన్ వస్తువులు, మెడిసిన్స్ సహా 375 వస్తువులు రేపటి నుంచి చౌకగా లభిస్తాయి.

1. రోజువారీ నిత్యావసరాలు :
ప్రస్తుతం 12శాతం జీఎస్టీతో గృహోపకరణాలు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వస్తాయి.
• టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ
• బిస్కెట్లు, స్నాక్స్, జ్యూస్‌లు వంటి ప్యాక్ చేసిన ఆహారాలు
• నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులు
• సైకిళ్ళు, స్టేషనరీ
• దుస్తుల, బూట్లు నిర్దిష్ట ధర వరకు

Read Also : Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. ఇలా కొన్నారంటే.. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!

2. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ :
ప్రస్తుతం 28శాతం పన్ను విధించే వస్తువులను 18శాతానికి తగ్గించవచ్చు. ధరలు దాదాపు 7శాతం నుంచి 8శాతానికి తగ్గుతాయి.
• ఎయిర్ కండిషనర్
• రిఫ్రిజిరేటర్, డిష్‌వాషర్
• పెద్ద స్క్రీన్ టెలివిజన్లు
• సిమెంట్ (గృహనిర్మాణం)

3. ఆటోమొబైల్ :
ఆటో రంగం కూడా భారీగా ప్రయోజనం పొందనుంది.
• చిన్న కార్లపై (1,200cc కన్నా తక్కువ ఇంజిన్లు) జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు
• ద్విచక్ర వాహనాలు కూడా దిగువ స్లాబ్‌లోకి పడిపోవచ్చు.
• పెద్ద లగ్జరీ కార్లు, SUVలపై అధిక పన్నులు కొనసాగింపు

4. ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు :
ప్రస్తుతం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు 18శాతం జీఎస్టీ లోబడి ఉన్నాయి. జీఎస్టీ 2.0లో ఖరీదైన ఈ ప్రీమియంలను తక్కువ శ్లాబ్ కిందకు తీసుకురావచ్చు. లేదంటే పూర్తిగా మినహాయింపు ఇవ్వవచ్చు.

ఈ వస్తువులపై జీరో జీఎస్టీ :

సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా కొన్నింటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. ఈ జాబితాలో ప్రధానంగా విద్యకు సంబంధించి ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. మ్యాప్‌లు, చార్టులు, పెన్సిళ్లు గ్లోబ్‌లు, షార్ప్‌నర్లు, ప్యాస్టెల్స్, క్రేయాన్స్ ఎక్స్‌సైజ్ పుస్తకాలు, నోట్ బుక్స్, ఎరేజరు వంటి వాటిపై జీఎస్టీ 12 శాతం ఉండగా పూర్తిగా తొలగించారు. జీరో జీఎస్టీ జాబితాలో చేర్చారు. అలాగే, ఆరోగ్య సంరక్షణ రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తివేశారు. 18 శాతం ఉండగా జీరోకి తీసుకొచ్చారు.

5 శాతంలోకి వచ్చిన వస్తువులు ఇవే :

చాలా రకాల ఉత్పత్తులను 5 శాతం జీఎస్టీలోకి తీసుకొచ్చారు. హస్త కళా ఉత్పత్తులు గ్రానైట్ దిమ్మెలు, పాలరాయి వంటిపై జీఎస్టీని 5 శాతంగా చేశారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం శ్లాబులో ఉండగా ఎలాంటి మార్పు చేయలేదు. ఇక నిత్యావసర వస్తువుల్లో తల నునెలు, షాంపూ, సబ్బులు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్, సేవింగ్ క్రీమ్‌లను 18 శాతం నుంచి 5 శాతం శ్లాబులోకి తెచ్చారు. వెన్న, మజ్జిక, నెయ్యి, పాల ఉత్పత్తులు, మిక్చర్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్ కీన్, వంట సామగ్రి, పాల సీసాలు, కుట్టు మిషన్లు, డైపర్లను 12 శాతం నుంచి 5 శాతంలోకి తగ్గించారు.

ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలో 18 శాతం జీఎస్టీ ఉన్న థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, గ్లూకో మీటర్, డయాగ్నోస్టిక్ కిట్లు, కళ్ల జోళ్లను 5 శాతంలోకి తెచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉన్న ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలను 5 శాతంలోకి తీసుకొచ్చారు. అలాగే 12 శాతం శ్లాబులో ఉన్న ట్రాక్టర్లు, స్పెసి ఫైడ్ బయో ఫెస్టి సైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, మైక్రో న్యూట్రియంట్స్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికాలను 5 శాతంలోకి మార్చారు. రైతులపై జీఎస్టీ భారం భారీగా తగ్గనుంది. చాలా ఉత్పత్తులపై ఇప్పుడు 5 శాతం జీఎస్టీ ఉంటుంది.

18 శాతంలోకి వచ్చిన వస్తువులివే :
ప్రస్తుతం 28 శాతంలో ఉన్న ఏసీలు, టీవీలు (32 ఇంచులు ఆపై), ప్రొజెక్టర్లు, మానిటర్లు, డిష్ వాషింగ్ మెషీన్లను 18 శాతానికి తగ్గించారు. వాహన రంగంలో 28 శాతం శ్లాబులో ఉన్న పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లు (1200 సీసీ లోపు), డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు (1500 సీసీలోపు), ఆటోలు, త్రీ వీలర్లు, 350 సీసీ వరకు టూ వీలర్లు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలను 18 శాతం శ్లాబులోకి తెచ్చారు. దీంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సిమెంటుపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.

ఖరీదైన వస్తువులివే :

జీఎస్టీ 2.0తో ప్రతిదీ చౌకగా మారదు. కొన్ని వస్తువులపై 40శాతం సిన్ టాక్స్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
• పొగాకు ఉత్పత్తులు, మద్యం, పాన్ మసాలా
• ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు
• పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ GST పరిధికి వెలుపల ఉన్నాయి. ఇంధన ధరలలో ఎలాంటి రిలీఫ్ ఉండదు.
• వజ్రాలు, విలువైన రాళ్ళు వంటి లగ్జరీ వస్తువులపై కూడా అధిక పన్నులు కొనసాగుతాయి.