HDFC బ్యాంక్ లో ఈ సేవలకు అంతరాయం

  • Publish Date - January 17, 2020 / 05:17 AM IST

భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇప్పటికే బ్యాంక్ తన వినియోగదారులకు సందేశాలను పంపినట్లు తెలిపింది. షెడ్యూల్ నిర్వహణలో భాగంగా ఐవిఆర్, ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు సేవలను జనవరి 18, 2020 ఉదయం 1 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవు. దాదాపు 11 గంటల పాటు సేవలు నిలిపివేయనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. షెడ్యూల్ మెయింటెనెన్స్ కు సంబంధించిన హెచ్చరికలను అధికారిక వైబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది.

గత ఏడాది డిసెంబర్ లో సాంకేతిక లోపాల కారణంగా రెండు సార్లు నెట్ బ్యాంకింగ్,మెుబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగిందని, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పింది. అలాంటి ఇబ్బందులను మళ్లీ కస్టమర్లులు ఎదురుకోకుండా ముందుగానే హెచ్చరిస్తున్నట్లు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ తెలిపింది. రైతుల కోసం ‘హర్ గావ్ హమారా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు