Hero MotoCorp Prices : జూలై 3 నుంచి భారీగా పెరగనున్న హీరో మోటోకార్ప్ బైకుల ధరలు.. ఏ బైకు ధర ఎంత ఉండొచ్చుంటే?

Hero MotoCorp Prices : హీరో స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, ప్యాషన్, ఎక్స్‌ట్రీమ్, జూమ్, మాస్ట్రో ఎడ్జ్, కంపెనీ జూలై 3 నుంచి ధరలను పెంచనుంది. ధర పెరుగుదల దాదాపు 1.5 శాతం ఉంటుంది. నిర్దిష్ట మోడల్‌లు, మార్కెట్‌లను బట్టి పెంపు ఉండొచ్చు.

Hero Splendor, HF Deluxe, Passion, Xtreme, Xoom, Maestro Edge, others

Hero MotoCorp Prices : ప్రముఖ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ధరల ప్రక్రియలో భాగంగా జూలై 3 నుంచి తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల పెరుగుదల దాదాపు 1.5 శాతం ఉంటుంది. నిర్దిష్ట మోడల్‌లు, మార్కెట్‌లను బట్టి పెంపు కచ్చితమైన పరిమాణం మారుతుందని హీరో మోటోకార్ప్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

కంపెనీ HF 100, HF డీలక్స్, Splendor+, Splendor+ Xtec, Passion+, Passion Xtec, Super Splendor, Super Splendor Xtec, Glamour, Glamour Xtec, Glamour Canvas, Xtreme 160R, Xtreme 46, Xtreme 416 వంటి మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.

Read Also : Honda Elevate Bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ చేసుకున్నారా? మీ బుకింగ్ రద్దు చేస్తే.. 100 శాతం రీఫండ్ గ్యారెంటీ..! 

కంపెనీ అందించే స్కూటర్లలో ప్లెజర్+ ఎక్స్‌టెక్, జూమ్, డెస్టిని 125 ఎక్స్‌టెక్, మాస్ట్రో ఎడ్జ్ 125, 4V, Xpulse 200T 4V ఉన్నాయి. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సవరించే విషయంలో కంపెనీ ధరల స్థానాలు, ఇన్‌పుట్ ఖర్చులు, వ్యాపార అవసరాలు వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్ కొత్త ధరలను పెంచనున్నట్టు తెలిపింది.

Hero Splendor, HF Deluxe, Passion, Xtreme, Xoom, Maestro Edge, others

కస్టమర్‌లపై ప్రభావాన్ని తగ్గించేందుకు హీరో మోటోకార్ప్ వినూత్న ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌లతో కొనసాగుతుందని పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాలలో రుతుపవనాల ప్రారంభం, మొత్తం ఆర్థిక సూచికలు డిమాండ్‌లో వృద్ధికి మంచి ఊతమిచ్చాయని, రాబోయే పండుగల సీజన్‌లో పరిశ్రమ వాల్యూమ్‌లు పుంజుకునే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

ఈ నెల ప్రారంభంలో Hero MotoCorp Xtreme 160R 4V 2023 బైక్ ధర రూ. 1,27,300 నుంచి రూ. 1,36,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర పరిధిలో రిలీజ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ 163cc 4-వాల్వ్ ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 16.9PS పవర్, 14.6Nm పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : Svitch Bike Experience Centre : హైదరాబాద్‌‌కు ‘స్విచ్ బైక్’ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వచ్చేసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు