Hero Splendor Launch : హీరో స్ప్లెండర్ కొత్త బైక్ మోడల్ వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

Hero Splendor Launch : ఈ హీరో బైక్ 100సీసీ సెగ్మెంట్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో ఒకే ఒక వేరియంట్‌తో వచ్చింది. ఈ బైక్ అత్యంత ఇష్టపడే కలర్ బ్లాక్ కలర్ కలిగి ఉంది.

Hero Splendor X-tec : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారి కంపెనీ హీరో నుంచి సరికొత్త మోడల్ బైక్ వచ్చేసింది. హీరో స్ప్లెండర్ పేరుతో అద్భుతమైన మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ బైక్ మైలేజీ పరంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బైకులోని చాలా ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.

Read Also : Realme GT 6 India Launch : భారత్‌కు ‘ఫ్లాగ్‌షిప్ కిల్లర్’ రియల్‌మి జీటీ 6 ఫోన్ వచ్చేస్తోంది.. జీటీ నియో 6కు రీబ్రాండెడ్ వెర్షన్..!

అంతేకాదు.. ఈ బైక్ ఎక్కువగా ఇంటి పనులకు, కొన్నిసార్లు ఇతర బయటి పనులకు కూడా వినియోగించుకోవచ్చు. ఈ హీరో బైక్ 100సీసీ సెగ్మెంట్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో ఒకే ఒక వేరియంట్‌తో వచ్చింది. ఈ బైక్ అత్యంత ఇష్టపడే కలర్ బ్లాక్ కలర్ కలిగి ఉంది. ఇంకా, ఈ బైకులో అందుబాటులో ఉన్న ఫీచర్లు, మైలేజ్, ధర వంటి మొత్తం వివరాలను తెలుసుకుందాం..

హీరో స్ప్లెండర్ ఎక్స్-టెక్ ఫీచర్లు :
మీరు ఈ కొత్త బైక్ ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్, డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ టాకోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, కాల్ అలర్ట్, ఎస్ఎంఎస్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ బోర్డ్, ఎస్ఎంఎస్ అలర్ట్, ప్యాసింజర్ వంటి అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కంపెనీ అందించింది. ఎలక్ట్రిక్ ఫీచర్, హాలోజన్ లైట్ వాల్వ్, టెయిల్ లైట్ బల్బ్, టర్న్ సిగ్నల్ లాంప్‌ను అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ఎక్స్-టెక్ ఇంజిన్ :
ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే.. మీరు ఇందులో 97సీసీ ఎయిర్‌పోర్ట్ సింగిల్ సిలిండర్ స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు 6000 ఆర్పీఎమ్ వద్ద 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మైలేజీని పరిశీలిస్తే.. 83 కిలోమీటర్ల వరకు భారీ మైలేజీని ఇవ్వగలదు. ఈ బైకు ఇంధన సామర్థ్యం 9.8 లీటర్లు. మంచి మైలేజీని ఇస్తుందని రుజువు అయిందని కంపెనీ పేర్కొంది.

హీరో స్ప్లెండర్ ఎక్స్-టెక్ ధర :
హీరో స్ప్లెండర్ బైక్ ధర విషయానికి వస్తే.. భారతీయ మార్కెట్లో కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. ఈ వేరియంట్ ధర రూ. 89,911 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Bajaj Fighter CNG Bike : ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ ‘బజాజ్ ఫైటర్’ కొత్త బైక్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు