Realme GT 6 India Launch : భారత్‌కు ‘ఫ్లాగ్‌షిప్ కిల్లర్’ రియల్‌మి జీటీ 6 ఫోన్ వచ్చేస్తోంది.. జీటీ నియో 6కు రీబ్రాండెడ్ వెర్షన్..!

Realme GT 6 India Launch : రియల్‌మి జీటీ 6టీ ఫోన్ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొత్త ఫోన్ లాంచ్ వివరాలను ప్రకటించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. రియల్‌మి జీటీ 7 ప్రో కూడా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి రానుంది.

Realme GT 6 India Launch : భారత్‌కు ‘ఫ్లాగ్‌షిప్ కిల్లర్’ రియల్‌మి జీటీ 6 ఫోన్ వచ్చేస్తోంది.. జీటీ నియో 6కు రీబ్రాండెడ్ వెర్షన్..!

Realme GT 6 India Launch Confirmed ( Image Credit : Google )

Realme GT 6 India Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయిన రియల్‌మి జీటీ 6 ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. కానీ, ఈ నెక్స్ట్ జీటీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

రియల్‌మి జీటీ 6టీ ఫోన్ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొత్త ఫోన్ లాంచ్ వివరాలను ప్రకటించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. రియల్‌మి జీటీ 7 ప్రో కూడా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ నెల ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన రియల్‌మి జీటీ నియో 6 మోడల్‌కు రియల్‌మి జీటీ 6 రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.

రియల్‌మి జీటీ 6 ఇండియా లాంచ్ ఎప్పుడంటే?:
రియల్‌మి జీటీ 6 భారత్, ఇతర ప్రపంచ మార్కెట్‌లలో త్వరలో లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. అయితే, అసలు తేదీని కంపెనీ వెల్లడించలేదు. ప్రీమియం-గ్రేడ్ ఫీచర్‌లు, ఏఐ-ఆధారిత సామర్థ్యాలను అందిస్తుంది. రియల్‌మి “ఫ్లాగ్‌షిప్ కిల్లర్” ట్యాగ్‌లైన్‌తో ఫోన్ ప్రమోట్ చేస్తోంది. రియల్‌మి జీటీ 6 ఫోన్, రియల్‌మి జీటీ 6టీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుంది.

ఆ తరువాతి ప్రారంభమైన జీటీ సిరీస్ రెండేళ్ల విరామం తర్వాత ఈ నెల ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లోకి రీఎంట్రీ వచ్చింది. రియల్‌‌మి జీటీ 6 అనేది రీబ్రాండెడ్ రియల్‌మి జీటీ నియో 6 పేరుతో రానుంది. మే 9న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కాగా.. రియల్‌మి జీటీ 6 ఫోన్ 12జీబీ + 256జీబీ వెర్షన్ ధర సీఎన్‌వై 2,099 (దాదాపు రూ. 22వేలు) ఉంటుంది.

రియల్‌మి జీటీ 6 స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
గ్లోబల్ మార్కెట్‌లలో రియల్‌మి జీటీ నియో 6 జీటీ 6గా వస్తుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5కె (1,264×2,780 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ, 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో కూడా వస్తుంది.

రియల్‌మి జీటీ నియో 6 ఫోన్ 10014ఎమ్ఎమ్ చదరపు వీసీ కూలింగ్ ఏరియాతో డ్యూయల్ త్రీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 120డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్టుతో 5,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ రెజర్ 50 అల్ట్రా వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!