Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ రెజర్ 50 అల్ట్రా వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

Motorola Razr 50 Ultra Launch : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా అత్యధిక వేగం 3.0GHzతో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుందని లిస్టింగ్ సూచిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీగా ఉండనుంది.

Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ రెజర్ 50 అల్ట్రా వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

Motorola Razr 50 Ultra Design, Key Specifications ( Image Credit : Google )

Updated On : May 31, 2024 / 4:48 PM IST

Motorola Razr 50 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ మోటోరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ ఈ ఏడాది చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అల్ట్రా మోడల్ సహా మరో కొత్త మోటోరోలా రెజర్ 50 ఫోన్ కూడా లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లు వరుసగా మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్, మోటోరోలా రెజర్ 40 ఫోన్‌లకు అప్‌గ్రేడ్ వెర్షన్ వస్తాయని భావిస్తున్నారు.

Read Also : Moto Morini X-Cape : కొత్త బైకు కొంటున్నారా? ఈ అడ్వెంచర్ బైకు ధరలు భారీగా తగ్గాయి..!

నివేదికలు, లీక్‌ల ప్రకారం.. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ల ముఖ్య ఫీచర్లు, ధర వివరాలను సూచించాయి. ఈ హ్యాండ్‌సెట్‌ల డిజైన్ రెండర్‌లు లీక్ అయ్యాయి. ఇటీవల, వనిల్లా మోటోరోలా రెజర్ 50 (TENAA) సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఇప్పుడు, మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ టెన్నా వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ జాబితాలో ఫోన్ డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా డిజైన్ (అంచనా) :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా టెన్నా లిస్టింగ్‌లో ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. లోపలి డిస్‌ప్లే పైభాగంలో కేంద్రీకృత హోల్-పంచ్ స్లాట్, స్లిమ్ బెజెల్స్‌తో కనిపిస్తుంది. చిన్న ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు రెండు వేర్వేరు సర్కిల్ కెమెరా మాడ్యూల్స్ ఫోన్ బ్యాక్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తాయి. కవర్ స్క్రీన్ బ్యాక్ ప్యానెల్ మధ్యలో కీలు వరకు విస్తరించి ఉన్నట్లు చూడవచ్చు. ఈ బ్రాండ్ ‘M’ దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆ తర్వాత రెజర్ లేబుల్ దిగువన ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ రైట్ టాప్ ఎడ్జ్ పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు (అంచనా) :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా లిస్టు ప్రకారం.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,460 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బయటి స్క్రీన్ 1,272 x 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 4-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా మునుపటి 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా అత్యధిక వేగం 3.0GHzతో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుందని లిస్టింగ్ సూచిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీగా ఉండనుంది. ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ, 16జీబీ, 18జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ మొత్తం 28జీబీ, 256జీబీ, 512జీబీ 1టీబీ నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుందని అంచనా.

కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. రాబోయే మోటరోలా క్లామ్‌షెల్ 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో పాటు డ్యూయల్ 50ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మోటోరోలారెజర్ 50 అల్ట్రా 998ఎంఎహెచ్, 2,832ఎంఎహెచ్ డ్యూయల్ సెల్‌ల ద్వారా సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. 3,830ఎంఎహెచ్ రేటింగ్ సామర్థ్యం 4,000ఎంఎహెచ్ విలువతో మార్కెట్ అవుతుంది. గత 3సి లిస్టింగ్ హ్యాండ్‌సెట్ 68డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వగలదని సూచించింది. ఈ ఫోన్ బరువు 189గ్రాముల పరిమాణంతో పాటు 171.4 x 73.9 x 7మిమీ ఉంటుంది.

Read Also : Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, బ్యాంకు ఆఫర్లు ఇవే