Hero Vida V2 Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? హీరో నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Hero Vida V2 Electric Scooter : హీరో మోటోకార్ప్ కొత్త రేంజ్ విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. హీరో విడా V2 లైట్, విడా V2 ప్లస్, విడా V2 ప్రో మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది.

Hero Vida V2 Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? హీరో నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Hero Vida V2 Electric Scooter Range Launched

Updated On : December 4, 2024 / 11:45 PM IST

Hero Vida V2 Electric Scooter : భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్త రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. మాస్ మార్కెట్ స్కూటర్ శ్రేణిలో విడా హీరో విడా V2 స్కూటర్‌తో ఎంట్రీ ఇచ్చింది. విడా V2 లైట్ ధర రూ. 96వేలు, విడా వి2 ప్లస్ ధర రూ. 1.15 లక్షలు, టాప్-స్పెక్ విడా వి2 ప్రో ధర రూ. 1.35 లక్షలు అనే మూడు వేరియంట్‌లు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అమ్మకానికి ఉన్నాయి.

ప్రతి వేరియంట్ వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. హీరో విడా V2 లైట్ 2.2kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఐడీసీ రేంజ్ 94 కి.మీ. విడా V2 లైట్ గంటకు 69కి.మీ గరిష్ట వేగం, రైడ్, ఎకో అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. రిమూవబుల్ బ్యాటరీని ఆరు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. హీరో విడా వి2 లైట్ టీవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 2903 వంటి వాటికి పోటీగా వస్తుంది.

హీరో V2 ప్లస్ 3.44kWh బ్యాటరీ ప్యాక్ ఐడీసీ పరిధి 143 కి.మీ. హీరో V2 ప్లస్ గంటకు 85కి.మీ టాప్ స్పీడ్, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. హీరో విడా V2 ప్రో అనేది 3.94kWh బ్యాటరీ, 165 కిమీ పరిధి, గంటకు 90కి.మీ గరిష్ట వేగంతో అత్యంత లోడ్ వేరియంట్.

Hero Vida V2 Electric Scooter Range Launched

Hero Vida V2 Electric Scooter  (Image Source : Google )

ఈ స్కూటర్ ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. మూడు స్కూటర్లలో పాత విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పోలి ఉంటుంది. మ్యాట్ నెక్సాస్ బ్లూ-గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ రెండు కొత్త కలర్ ఆప్షన్లతో ఉన్నాయి. హీరో విడా V2 ప్రో స్వింగ్‌ఆర్మ్ మౌంట్ చేసిన పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను పొందుతుంది. 6kW, 25Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

అన్ని మోడల్‌లు కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, రీ-జెన్ బ్రేకింగ్, కస్టమ్ రైడింగ్ మోడ్‌లు వంటి అనేక ఫీచర్లను పొందుతాయి. 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కూడా పొందవచ్చు. కొత్త విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లు వాహనం కోసం 5ఏళ్లు/50వేల కిమీ వారంటీ, బ్యాటరీ ప్యాక్ 3ఏళ్లు/30వేల కి.మీ వారంటీతో వస్తాయి. విడా V2 కస్టమర్‌లు భారత మార్కెట్లో 250+ నగరాల్లో 3100కి పైగా ఛార్జింగ్ పాయింట్‌లతో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను పొందుతారు.

Read Also : Poco M7 Pro 5G Series : పోకో M7 ప్రో 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. ఈ నెల 17నే లాంచ్..!