×
Ad

Holi School Holiday 2026 : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రంగుల పండుగకు రెడీ అవ్వండి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు హోలీ హాలిడే డేట్ ఇదే!

Holi School Holiday 2026 : హోలీ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అయితే, మార్చి 3 లేదా 4వ తేదీన హోలీ జరుపుకోనున్నారు. రాష్ట్రాల వారీగా ఏయే తేదీల్లో హోలీ జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

Holi School Holiday 2026

Holi School Holiday 2026 : హోలీ పండగ వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా హోలీని ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈసారి హోలీ పండగ ఎప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మారింది.  మార్చి 4, 2026న హోలీ పండగ వస్తుంది. అయితే, మార్చి 3వ తేదీ మంగళవారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 3నే హోలీ పండగ జరుపుకుంటారు.

మార్చి 2వ తేదీ సోమవారం హోలీ దహన్ జరుపుకుంటారు. అయితే, హోలీ తేదీల విషయంలో ఇప్పటికీ గందరగోళంగా ఉంది. మార్చి 3న లేదా మార్చి 4న హోలీ జరుపుకుంటారా అనే దానిపై రాష్ట్రాలవారీగా స్పష్టత వచ్చింది. మీ రాష్ట్రంలో కూడా హోలీ ఎప్పుడు జరుపుకుంటారు? హోలీ రోజున స్కూళ్లకు సెలవులు ఉంటుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

2026 హోలీ పండగ ఎప్పుడంటే? :
ఈ ఏడాదిలో హోలీని బుధవారం, మార్చి 4, 2026న జరుపుకుంటారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. హోలీకా దహన్ మార్చి 2న జరుగుతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీకా దహన్ తర్వాత రోజు సంభవిస్తుంది. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున హోలీని జరుపుకోరు. కాబట్టి, ఈ ఏడాదిలో హోలీ పండుగను మార్చి 4న జరుపుకుంటారు.

ఉత్తరప్రదేశ్‌లో స్కూళ్లకు సెలవు :
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హోలీకి 3 రోజుల ప్రభుత్వ సెలవు ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 4 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఫిబ్రవరి జీతాలు, పెన్షన్లను పండుగకు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read Also : WhatsApp Web : సిమ్ బైండింగ్ ఎఫెక్ట్.. మీ వాట్సాప్ వెబ్ అదేపనిగా లాగౌట్ అవుతుందా? అసలు రీజన్ ఏంటి? ఎలా ఫిక్స్ చేయాలంటే?

ఢిల్లీ స్కూల్ మూసివేత :
ఢిల్లీలోని చాలా పాఠశాలల్లో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, హోలీ రోజున పరీక్షలు ఉండవు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా మార్చి 4న ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించింది.

బీహార్‌లో స్కూళ్లు మూసివేత :
బీహార్ విద్యా శాఖ అధికారిక విద్యా క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని పాఠశాలలు మార్చి 3 లేదా 4 తేదీలలో మూతపడనున్నాయి. ఈ తేదీలలో రాష్ట్రంలో హోలీ సెలవు దినంగా ప్రకటించవచ్చు. హోలీ పండుగను రెండు రోజుల పాటు వివిధ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అధికారిక నిర్ధారణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాలలను సంప్రదించాలి.

ఈ రాష్ట్రాల్లో మార్చి 3నే హోలీ పండగ? :

  • మహారాష్ట్ర
  • మధ్యప్రదేశ్
  • ఉత్తరాఖండ్
  • అస్సాం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రాజస్థాన్
  • పశ్చిమ బెంగాల్
  • గోవా
  • జార్ఖండ్
  • కేరళ

మార్చి 3న ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు బంద్? :
4వ తేదీన హోలీ జరుపుకునే రాష్ట్రాల్లో గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లలో మార్చి 4న హోలీ జరుపుకుంటారు. ఈ రాష్ట్రాల్లో ఈరోజున పాఠశాలలకు సెలవు ఉండవచ్చు.