Xiaomi TV S Mini LED : షావోమీ లవర్స్‌కు పండగే.. కొత్త మినీ LED స్మార్ట్ టీవీ వస్తోంది.. ఫీచర్లు భలే ఉన్నాయి.. ఫుల్ డిటెయిల్స్
Xiaomi TV S Mini LED : భారత మార్కెట్లోకి ఏప్రిల్ 15న షావోమీ నుంచి సరికొత్త మినీ ఎల్ఈడీ టీవీ వస్తోంది. ఫీచర్లు చూసేందుకు కిర్రాక్ ఉన్నాయి.. ఈ టీవీలు కలర్ ఫుల్ ఫీచర్లతో అదిరిపోయే ఆప్షన్లతో వస్తున్నాయి..
Xiaomi TV S Mini LED
- షావోమీ QD-Mini ఎల్ఈడీ టీవీలలో అడ్వాన్స్ పిక్చర్ టెక్నాలజీ
- 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 98-అంగుళాల సైజులు
- ఈ షావోమీ టీవీలు 1200 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు
Xiaomi TV S Mini LED : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 15న షావోమీ టీవీ S మినీ ఎల్ఈడీ సిరీస్ 2026 లాంచ్ చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ కంపెనీ ఆన్లైన్ హ్యాండిల్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ల ద్వారా ఈ టీవీల ఫీచర్లను టీజ్ చేసింది. ఈ కొత్త టీవీలు ‘క్వాంటం మ్యాజిక్’ టెక్నాలజీతో రానున్నాయి. క్యూడీ-మినీ ఎల్ఈడీ ప్యానెల్‌తో రానున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి, షావోమీ ఇండియాలో ఎకోసిస్టమ్‌ను విస్తరిస్తోంది. కొత్త ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు కూడా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. షావోమీ టీవీ లాంచ్‌కు సంబంధించిన తేదీ, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో సహా డేటాను ఇప్పుడు తెలుసుకుందాం..
S మినీ ఎల్ఈడీ సిరీస్ ఎలా? ఎక్కడ పొందాలి? :
ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తేదీని కంపెనీ ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. షావోమీ టీవీ S మినీ ఎల్ఈడీ సిరీస్, కంపెనీ క్వాంటమ్ మ్యాజిక్ డిస్ప్లే టెక్నాలజీని అందిస్తుంది. భారత్ మార్కెట్లో షావోమీ ఫస్ట్ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టనుంది.
స్పెషల్ మైక్రోసైట్‌ను కూడా భారత మార్కెట్లో కంపెనీ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే, షావోమీ ఆన్లైన్ స్టోర్ కాకుండా ఈ టీవీలను విక్రయించేందుకు బ్రాండ్ మరేదైనా ఆన్లైన్ రిటైల్ పార్టనర్ తో డీల్ కుదుర్చుకుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
షావోమీ టీవీ S మినీ ఎల్ఈడీ సిరీస్ స్పెసిఫికేషన్లు :
షావోమీ టీవీ S మినీ ఎల్ఈడీ సిరీస్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ లైనప్‌లో 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 98-అంగుళాలు అనే 5 స్క్రీన్ సైజులు ఉంటాయి. మార్కెట్ డిమాండ్‌ను బట్టి షావోమీ ఇండియాలో 55-అంగుళాలు, 65-అంగుళాల స్క్రీన్ సైజులతో ఈ టీవీ అమ్మకాలను ప్రారంభించవచ్చు.
ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 4K (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుందని అంచనా. 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, 94శాతం డీసీఐ-P3 కలర్ గామట్ కవరేజ్, HDR10+, HLG సపోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
టీవీ ఆడియో కెపాసిటీ :
ఆడియో కోసం రాబోయే ఈ షావోమీ టీవీలో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ 15W స్పీకర్లు ఉన్నాయి. ఇతర షియోమీ టీవీల మాదిరిగానే ఇందులో గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది. తద్వారా మెయిన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కనెక్ట్ అవుతుంది. అలాగే, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్, ఎయిర్‌ప్లే కంపాటిబిలిటీని కూడా అందిస్తుంది.
కనెక్టివిటీ సపోర్ట్ అదుర్స్ :
కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 5, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. పోర్ట్‌ల విషయానికొస్తే.. ఈ సరికొత్త టీవీ లైనప్‌లో రెండు HDMI 2.0 పోర్ట్‌లు, ఒక HDMI 2.1 పోర్ట్ ఉన్నాయి. అదనంగా, ఇందులో 3 USB పోర్ట్‌లు, ఈథర్నెట్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
