SBI గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై కీలక ప్రకటన.. హోమ్ లోన్ తీసుకున్న వారికి.. తీసుకోవాలి అనుకునే వారికి..
మీరు హోమ్‌లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా?

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తమ వద్ద హోంలోన్ తీసుకున్న వారికి శుభవార్త అందించింది. ఈబీఆర్‌ఎల్ (ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్)తో పాటు ఈబీఎల్‌ఆర్ (రెపో లింక్డ్ లెండింగ్ రేట్) ను తగ్గించింది.
ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇటీవలే ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. రెపో రేటును 6.50 శాతం 6.25 శాతానికి తగ్గించింది. అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
దీంతో ఎస్‌బీఐ ఈబీఆర్‌ఎల్-ఈబీఎల్‌ఆర్‌పై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంసీఎల్‌ఆర్‌తో పాటు బీపీఎల్‌ఆర్ రేట్లలో ఎస్‌బీఐ ఎలాంటి మార్పులనూ చేయలేదు. హోమ్‌లోన్స్‌కు రెపోరేటును అనుసంధానం చేయడం కోసం ఎస్‌బీఐ నాలుగున్నరేళ్ల నుంచి ఈబీఎల్‌ఆర్ విధానాన్ని పాటిస్తోంది.
Also Read: విష ప్రచారం అంటూ సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ.. సంచలన కామెంట్స్
రెపోరేటు మారిన ప్రతిసారి ఎస్‌బీఐ కూడా ఈ ఈ రేటును మార్చుతుంది. ఇప్పుడు ఈ రేటను 9.15 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గించింది. అంటే 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీనితో అనుసంధానమయ్యే లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి.
ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను కూడా 8.50 శాతానికి తగ్గించడంతో హోంలోన్‌లతో పాటు వ్యాపార రుణాలు కూడా తగ్గుతాయి. ఇప్పటికే ఎస్‌బీఐ నుంచి అందుకు సంబంధించిన లోన్లు తీసుకున్న వారికి ఆ బ్యాంకు నిర్ణయం లాభాలు కలిగిస్తుంది.
దీంతో రుణాలు తీసుకున్న వారు శారి ఈఎంఐలు లేదంటే రుణాలు తీర్చేందుకు పెట్టుకున్న సమయాన్ని తగ్గించుకునే సౌకర్యం కలుగుతుంది. మీరు ఏ ఎస్‌బీఐలో రుణాలు తీసుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్లి అడిగితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, ఆ మేరకు మీ ఈఎంఐలు చెల్లించవచ్చు.
ఇవాళ ఎస్‌బీఐ ఈబీఆర్‌ఎల్, ఈబీఎల్‌ఆర్‌ను తగ్గిచినట్లే పలు బ్యాంకులు కూడా ఇటీవల వాటిని తగ్గించాయి. వాటిలో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి.