Homebuyers Tax Exemption : ఇల్లు కొంటున్నారా? ఇక పెట్టుబడి పెట్టొచ్చు.. పన్ను మినహాయింపు పొందొచ్చు.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలామంది Taxpayers అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిపై పన్ను మినహాయింపు దరఖాస్తు గడువు తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

Homebuyers Tax Exemption

Homebuyers Tax Exemption : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలామంది పన్నుదారులు (Taxpayers) అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిపై పన్ను మినహాయింపు (Tax Deduction) దరఖాస్తు గడువు తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఒక నివాస గృహంపై పెట్టుబడి పెట్టడానికి సమయం మూడు నెలలకు పైగా పొడిగించింది. ఏప్రిల్ 1న లేదా ఆ తరువాత చేయాల్సిన పెట్టుబడిపై ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సెక్షన్ 54 నుంచి 54GB నిబంధనల ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు పెట్టుబడి, డిపాజిట్, చెల్లింపు, సముపార్జన, కొనుగోలు, నిర్మాణం వంటి వాటిపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పన్ను మినహాయింపు దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 29 మధ్యవరకు అవకాశం ఉంది. అందులో (రెండు రోజులు కలుపుకొని), 2021 సెప్టెంబర్ 30న లేదా అంతకు ముందే పూర్తి చేసుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఆదాయపు పన్ను చట్టం 1962లోని సెక్షన్ 54 సెక్షన్ 54GB దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి మినహాయింపును పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం.. మీరు నివాస ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం కోసం తిరిగి పెట్టుబడి పెడితే నివాస ఆస్తిని అమ్మడంపై మూలదనం నుంచి పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54GB కింద, అర్హత కలిగిన సంస్థ ఈక్విటీ షేర్లకు చందా కోసం మీరు మొత్తాన్ని పెట్టుబడి పెడితే, నివాస ఆస్తి బదిలీ ద్వారా పొందే మూలధన లాభం నుంచి కూడా మినహాయింపు పొందవచ్చు.

కేంద్ర బడ్జెట్ 2019 సెక్షన్ 54 కింద మూలధన లాభంపై మినహాయింపు పొడిగించింది. లాభం 2 కోట్ల కన్నా తక్కువ ఉంటే రెండు నివాస గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి అనుమతి ఉంటుంది. అలాగే పన్ను చెల్లింపుదారుడు ఈ ఎంపికను ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. గతంలో ఒక కొనుగోలు లేదా నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉండేది.