Honda Activa 125 Launch : హోండా యాక్టివా 125 వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Honda Activa 125 Launch : కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motors India) నుంచి యాక్టివా 125 2023ని లాంచ్ చేసింది.
Honda Activa 125 Launch : కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motors India) నుంచి యాక్టివా 125 2023ని లాంచ్ చేసింది. హోండా యాక్టివా 125 2023 మోడల్ టీవీఎస్ జూపిటర్ 125, సుజుకి యాక్సెస్ 125 హీరో డెస్టినీ 125కు పోటీదారుగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త వెహికల్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. హోండా Activa 2023 ధర రూ. 78,920 నుంచి మొదలై రూ. 88,093 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) వరకు ఉంటుంది.
యాక్టివా 2023లో 125cc PGM-FI ఇంజన్ ఉంది. స్మార్ట్ పవర్ (eSP), హోండా ACG స్టార్టర్, స్టార్ట్ సోలనోయిడ్ను ఇంటిగ్రేట్ అయింది. కంపెనీ, ఇప్పుడు యాక్టివా 125 2023తో హోండా స్మార్ట్ కీ (Smart Key)ని అందిస్తోంది. స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. స్కూటర్ ఈక్వలైజర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS)ని పొందుతుంది. అల్లాయ్ వీల్స్ ట్యూబ్‌లెస్ టైర్లతో అమర్చబడి ఉంటాయి. కొత్త టైర్ కాంపౌండ్ టెక్నాలజీతో హోండా ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.
హోండా యాక్టివా 125 ప్రముఖ ఫీచర్లలో Full LED హెడ్‌ల్యాంప్, రీస్టైల్ సిగ్నేచర్ LED పొజిషన్ ల్యాంప్స్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో సైడ్-స్టాండ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, పాసింగ్ స్విచ్, ఓపెన్ ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ (కొత్తది), రెండు-క్లోజడ్ ఇంధన ప్రారంభ సిస్టమ్‌తో వచ్చింది. అంతేకాకుండా, Activa 125 H-స్మార్ట్ వేరియంట్ లాక్ మోడ్‌తో అమర్చబడి ఉంది. ఫిజికల్ కీని వాడాల్సిన అవసరం లేకుండా ఫైవ్-ఇన్-వన్ ఫంక్షన్‌ను (లాక్ హ్యాండిల్, ఇగ్నిషన్ ఆఫ్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్, సీట్ ఓపెన్ ఇగ్నిషన్ ఆన్) అందిస్తుంది.
హోండా యాక్టివా 125 2023లో పెర్ల్ నైట్ స్టార్ట్ బ్లాక్, హెవీ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ అనే 5 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్కూటర్ డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్ అనే 4 వేరియంట్లను కలిగి ఉంది. వేరియంట్ వారీగా చూస్తే.. హోండా యాక్టివా 125 2023 ధరలు ఇలా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ).
* హోండా యాక్టివా 125 2023 డ్రమ్ – రూ. 78,920
* హోండా యాక్టివా 125 2023 డ్రమ్ అల్లాయ్ – రూ. 82,588
* హోండా యాక్టివా 125 2023 డిస్క్ – రూ. 86,093
* హోండా యాక్టివా 125 2023 హెచ్-స్మార్ట్ – రూ. 88,093