Honda CB300R 2023 : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300R 2023 బైక్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతంటే?
Honda CB300R 2023 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హోండా (CB300R 2023) కేవలం 146కిలోల బరువును కలిగి ఉంది. ఈ బైక్ కేటగిరీలో అత్యంత తేలికైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.
- Sreehari A
- Published On : October 16, 2023 / 09:58 PM IST
Honda CB300R 2023 launched in India, All Details in Telugu
Honda CB300R 2023 Launch in India : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda CB300R 2023) హోండా CB300R 2023ని లాంచ్ చేసింది. ఆధునిక టెక్నాలజీని రెట్రో-ప్రేరేపిత డిజైన్‌తో వచ్చింది. ఈ బైక్ ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కు సొంతం చేసుకోవచ్చు.
కంపెనీ బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల నుంచి ఈ హోండా బైక్ కొనుగోలు చేయవచ్చు. హోండా CB300R 2023 ఫోన్ 286.01cc, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OBD2A-కంప్లైంట్, PGM-FI ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 31.1PS శక్తిని, 27.5Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
Read Also : Apple Affordable iPads : అత్యంత సరసమైన కొత్త ఐప్యాడ్‌లు.. ఈ నెల 17నే లాంచ్.. పూర్తి వివరాలు మీకోసం..!
హోండా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
సున్నితమైన గేర్ మార్పులకు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా చేర్చింది. డిజైన్ వారీగా హోండా CB300R 2023 ఐకానిక్ హోండా CB1000R లీటర్-క్లాస్ రోడ్‌స్టర్ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో ఇంధన ట్యాంక్, నియో స్పోర్ట్స్ కేఫ్ DNA బీఫ్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.
రౌండ్ LED హెడ్‌ల్యాంప్, LED వింకర్‌లు, LED టెయిల్ ల్యాంప్‌తో కూడిన ఆల్-LED లైటింగ్ సిస్టమ్ ద్వారా బైక్ మరింత మెరుగుపడింది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హజార్డ్ లైట్ స్విచ్ ఉన్నాయి.
Honda CB300R 2023 launched in India
హోండా CB300R 2023 మోటార్‌సైకిల్ కేవలం 146కిలోల బరువును కలిగి ఉంది. కేటగిరీలో అత్యంత తేలికైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. 41mm USD ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఎడ్జెస్ట్ చేయగల మోనోషాక్‌తో వచ్చింది.
బ్రేకింగ్ వర్కింగ్ కోసం.. బైక్ 296mm ఫ్రంట్ డిస్క్, 220mm బ్యాక్ డిస్క్‌తో వస్తుంది. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికమైనది. హోండా CB300R 2023 బైక్ పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ మాసివ్ గ్రే మెటాలిక్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు ఇప్పుడే ఓపెన్ అయ్యాయి.
