Honda New Two Wheelers : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? దీపావళికి ముందే హోండా నుంచి 3 కొత్త టూ-వీలర్లు.. ఏ మోడల్ ఎలా ఉండొచ్చుంటే?

Honda New Two Wheelers : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle), స్కూటర్ ఇండియా (Scooter India) 2023 దీపావళికి (Diwali) ముందు 3 కొత్త ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయనుంది.

Honda New Two Wheelers : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? దీపావళికి ముందే హోండా నుంచి 3 కొత్త టూ-వీలర్లు.. ఏ మోడల్ ఎలా ఉండొచ్చుంటే?

Honda New Two Wheelers _ Honda to launch 3 new two-wheelers before Diwali, Check Full Details

Honda New Two Wheelers : కొత్త టూ వీలర్ బైకులు కొనేందుకు చూస్తున్నారా? అయితే, మూడు నెలలు పాటు ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle), స్కూటర్ ఇండియా (Scooter India) 2023 దీపావళికి (Diwali) ముందు 3 కొత్త ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయనుంది. రాబోయే ఈ కొత్త మోడల్ మోటార్ సైకిళ్లు అంతర్గత దహన యంత్రం (ICE) నమూనాలతో రానున్నాయి. మూడు కొత్త మోడళ్లలో 125CC స్కూటర్, 160CC మోటార్ సైకిల్ ఉన్నాయి.

వచ్చే మూడు నెలల్లో ఈ రెండూ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. మూడో కొత్త మోడల్ 350CC మోటార్‌సైకిల్ అని, దీపావళికి ముందు భారత మార్కెట్లోకి ప్రవేశపెడతామని చెప్పారు. 350cc మోటార్‌సైకిల్ హోండా H’ness CB350 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Moto G13 Launch in India : ఈ మోటో G13 ఫోన్ కేవలం రూ. 9,499 మాత్రమే.. అద్భుతమైన ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

హోండా మాస్-సెగ్మెంట్ మోటార్‌సైకిల్ లైనప్‌లో షైన్ Shine 100, CD 110 డ్రీమ్, లివో, Shine125, SP125, యునికార్న్, X-బ్లేడ్, హార్నెట్ 2.0, CB 200X ఉన్నాయి. ఇప్పటికే, హోండా కంపెనీ డియో, యాక్టివా, యాక్టివా 125, గ్రాజియా 125 వంటి స్కూటర్లను విక్రయిస్తోంది.

Honda New Two Wheelers _ Honda to launch 3 new two-wheelers before Diwali, Check Full Details

Honda New Two Wheelers _ Honda to launch 3 new two-wheelers before Diwali 

కంపెనీ ప్రీమియం మోటార్‌సైకిల్ రేంజ్‌లో CB300F, CB300R, H’ness CB350, CB350RS, CB500X, CBR650R, CB650R, CBR1000RR-R ఫైర్‌బ్లేడ్, CBR1000RR-R ఫైర్‌బ్లేడ్, ఆఫ్రికా టోర్నమెంట్ టూర్‌బ్లేడ్, CBR1000RR-R అందుబాటులో ఉన్నాయి.

ఇటీవలే లాభదాయకమైన 100cc విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన షైన్ 100ని రూ. 64,900 (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. హోండా షైన్ 100 హీరో స్ప్లెండర్+, హీరో HF డీలక్స్, బజాజ్ ప్లాటినా 100 వంటి కంపెనీలకు పోటీదారుగా ఉంది. హోండా యాక్టివా రేంజ్ స్కూటర్‌లను H’ness CB350, CB350RS మోటార్‌సైకిళ్లను BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా కంపెనీ అప్‌డేట్ చేసింది.

Read Also : Google Chrome Feature : డెస్క్‌టాప్‌ యూజర్లకు పండగే.. గూగుల్ క్రోమ్‌‌లో సరికొత్త ఫీచర్లు.. ఇక మీ బ్రౌజర్‌ సూపర్ ఫాస్ట్‌..!