Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Honda Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (OEM) మోడల్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Honda electric scooter launch in India on November 27

Updated On : November 8, 2024 / 7:51 PM IST

Honda Electric Scooter : ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. ఈ నెల 27న దేశ మార్కెట్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ మోడల్‌ను లాంచ్ చేయనుంది. యాక్టివా, డియో వంటి మోడళ్లకు పోటీగా అంతర్గత దహన ఇంజిన్ (ICE) స్కూటర్ సెగ్మెంట్‌లో హోండా మొదటి ఎలక్ట్రిక్ మోడల్ స్కూటర్‌గా రానుంది. భారత మార్కెట్లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సెగ్మెంట్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే.. అక్టోబర్ పండుగ నెలలో 139,159 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ డేటా ప్రకారం.. 2,065,095 యూనిట్లకు విక్రయించిన మొత్తం ద్విచక్ర వాహనాల్లో కేవలం 6.74శాతం మాత్రమే ఉన్నాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) డేటా ప్రకారం.. అక్టోబర్‌లో హోండా 554,249 యూనిట్ల ఐసీఈ ద్విచక్ర వాహనాలను రిటైల్ చేసింది. ఈ నెలలో 26.84 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది.

ప్రస్తుతం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (OEM) మోడల్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఓలా ఎస్1 రేంజ్‌‌తో ముందంజలో ఉండగా టీవీఎస్ ఐక్యూబ్ ఎక్స్ వేరియంట్ అందిస్తోంది. బజాజ్ చేతక్‌ను కూడా విక్రయిస్తుంది. ఏథర్ రిజ్టా 450ని కలిగి ఉంది. హీరో విడా వి1 రేంజ్ కలిగి ఉంది.

Read Also : Google Pixel 9 Pro Cost : గూగుల్ పిక్సెల్ 9 ప్రో తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?