Gold Price Forecast 2025: కొత్త ఏడాది బంగారం ధరలు తగ్గుతాయా? ట్రంప్‌ ప్రభావం ఎలా ఉండనుంది?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయనుండంతో వాణిజ్య యుద్ధ పరిస్థితులు పెరుగుతాయని విశ్లేషణలు వినపడుతున్నాయి.

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలవడం, వచ్చే నెల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం, కొత్త ఏడాది వస్తుండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎలా ఉండనున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2024లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు అధికంగా పెరిగాయి. ఈ సారి కూడా పరిస్థితులు అలాగే ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయనుంండంతో వాణిజ్య యుద్ధ పరిస్థితులు పెరుగుతాయని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇది భౌగోళిక రాజకీయ సంక్షోభానికి ఊతమిస్తుందని ప్రముఖ బిజినెస్ వెబ్‌సైట్‌ మింట్ పేర్కొంది.

అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు, ట్రంప్‌ నాయకత్వంలో అనుసరించే అనూహ్య విధానాల వల్ల పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడే సురక్షితంగా అనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

OnePlus 13 Price : కొత్త ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

ట్రంప్ రెండోసారి పదవీకాలం చేపట్టిన మొదటి సంవత్సరంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని నిపుణులు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. బంగారంపై పెట్టుబడులు ఎంతో సురక్షితం. 2025లో నిఫ్టీ, బీఎస్‌ఈ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు.. యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు, యూఎస్ డాలర్, బిట్‌కాయిన్‌ల వంటి వర్చువల్ ఆస్తుల నుంచి సవాళ్లను ఎదుర్కొంటాయని నిపుణులు చెప్పారు.

దీంతో 2025లో ఎంసీఎక్స్‌ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్) బంగారం ధరలు 10 గ్రాములకు రూ.76,800 వద్ద నుంచి రూ.78,000 మార్కును తాకవచ్చని అంటున్నారు. అంటే 2025లో బంగారం ధరలు పెరగవచ్చు.