ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్లు.. కేంద్రం ఏం చేస్తుందంటే?

  • Publish Date - August 28, 2019 / 10:42 AM IST

దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఇండియా (RBI) సాయం తీసుకుంది. ఎప్పటినుంచి ఆర్థివ వ్యవస్థ వృద్ధిబాటలో పయనించేందుకు వీలుగా ఆర్బీఐని సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ క్రమంలో  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి మిగులు లేదా డివిడెండ్ రూపంలో రూ. లక్షా 23వేల 414 లక్షల కోట్లు ఇచ్చింది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ కింద రూ. 52వేల 637 లక్షల కోట్లు బదిలీ చేసింది. 

మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సూచనలతో అధిక నగదు నిల్వలను కేంద్రప్రభుత్వానికి బదిలీ చేసింది ఆర్బీఐ. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సభ్యులు నగదు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ బ్యాంకు అధిక మొత్తంలో కేంద్రానికి మిగులు బదిలీ చేయడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ అయినప్పటి నుంచి మిగులు నగదును ఆర్బీఐ బదిలీ చేస్తూ వస్తోంది. రిజర్వ్ బ్యాంకు నగదు బదిలీ చేయడం వల్ల ఐదేళ్లుగా మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లలో సెంట్రల్ బ్యాంక్ చెల్లించిన మొత్తం డివిడెండ్ కంటే ఇది ఎక్కువ మొత్తమని చెప్పాలి. 

అంత పెద్ద మొత్తం కాదు : 
* ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయడం పెద్ద మొత్తమేమి కాదు. కేంద్రం.. ఇప్పటికే రూ.90వేల కోట్లను అకౌంట్‌లో చూపించింది. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో 80శాతం ఎక్కువే. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.28వేల కోట్లు తాత్కాలిక మిగులు రూపంలో చెల్లించింది. ఇప్పుడు అది కాస్తా సుమారుగా రూ.58వేల కోట్ల బొనాంజాతో వస్తుంది.  

ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బాటలు : 
* అదనపు పన్నుయేతర ఆదాయం (ప్రత్యక్ష-పరోక్ష) పన్ను వసూళ్లలో (గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ కొరత రూ .1.7 లక్షల కోట్లు) దాని ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలు ఉంటుంది. ఆర్బీఐ ఇచ్చిన మిగులు నిధులను సరైన క్రమంలో అవసరాలకు వినియోగించినట్టుయితే వరుసగా నాలుగు త్రైమాసికాలకు క్షీణించిన వృద్ధి రేటుతో పాటు ఆర్థిక వ్యవస్థను పుంజుకోనేందుకు ఉపకరిస్తుంది. 

* ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధి ఐదేళ్లలో బలహీనంగా ఉంటుంది.
* ప్రభుత్వం తీసుకున్న రుణాలను తగ్గించగలదు.
* పరిశ్రమల కోసం వెచ్చించవచ్చు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఆటోమొబైల్స్ మందగమనం ద్వారా ప్రభావితమైన రంగాలను శక్తివంతం చేయవచ్చు. 
* ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్నంత పెద్ద మొత్తం కాదు. దీని ప్రభావం అదనపు నిధులపై ఉండకపోవచ్చు.
* ప్రభుత్వం అదనపు నిధులను ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది.