SIP Calculator : సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు! SIPలో నెలకు ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. పూర్తి లెక్కలివే..!
SIP Calculator : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎస్ఐపీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ఎంచుకోండి. ప్రతినెలా కొద్దిమొత్తంలో ఇలా పెట్టుబడి పెడుతూ వెళ్లారంటే 15ఏళ్ల నుంచి 25 ఏళ్లలో కోటి సంపాదించడం చాలా ఈజీ.. అది ఎలాగంటే?
- Sreehari A
- Published On : April 11, 2026 / 06:26 PM IST
SIP Calculator
- 15 ఏళ్లలో రూ. కోటి కోసం నెలకు రూ.20,016 ఎస్ఐపీ చేయాలి
- 20 ఏళ్లలో రూ. కోటి సంపాదన కోసం నెలకు రూ.10,108 ఎస్ఐపీ చేయాలి
- 25 ఏళ్లలో రూ. కోటి కోసం నెలకు రూ.5,322 ఎస్ఐపీ చేయాలి
SIP Calculator : కోటీశ్వరుడు కావాలని ఎవరికి ఉండదు.. అందరూ కోట్లు సంపాదించాలని కలలు కంటుంటారు. మీరు కూడా కోటీశ్వరుడు కావాలని అనుకుంటే ఇది మీకోసమే.. చాలా మంది సొంత వ్యాపారాలతో ఈ కలను నెరవేర్చుకుంటారు. మరికొందరు పెద్ద కంపెనీలలో (SIP Calculator) ఉన్నత పదవుల్లో చేరి అలా తమ కలను సాధిస్తారు. అయితే, ఒక సాధారణ వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే అంత ఈజీ కాదు. దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
మీరు ఉద్యోగం చేసే సామాన్య వ్యక్తి అయితే.. మీ జీతంలో కొంత భాగాన్ని SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుండాలి. కొన్ని ఏళ్లలో మీరు కోటీశ్వరులు కావచ్చు. కానీ, ఎన్ని సంవత్సరాలలో ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది పూర్తి లెక్కల ద్వారా తెలుసుకుందాం..
SIP ద్వారా ఎన్ని ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు? :
మీరు SIP ద్వారా కోటీశ్వరులు కావాలనుకుంటే.. ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది మీరు పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కొందరు 15 ఏళ్లు ఎంచుకుంటే మరికొందరు 20 ఏళ్లు లక్ష్యాన్ని ఎంచుకుంటారు. ఏదైనా మీరు SIPలో పెట్టుబడి పెట్టే మొత్తం మీ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది.
మీరు 15 ఏళ్లలో రూ.1 కోటి కార్పస్‌ను కూడబెట్టాలనుకుంటే.. ఎంత మొత్తంలో మొత్తంలో పెట్టాలి? అదే 20 ఏళ్లలో రూ. కోటి సంపాదించాలంటే ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలో తెలిసి ఉండాలి.
మీరు ఎన్ని ఏళ్లలో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లకు లెక్కించి రూ. కోటి కార్పస్‌ను కూడబెట్టడానికి మీరు ప్రతి నెలా ఎస్ఐపీలో ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం..
ప్రతి నెలా ఎంత SIP చేయాలి? :
15 ఏళ్లలో కోటీశ్వరులు అయ్యేందుకు మీరు నెలవారీ సిప్ (SIP)లో 15 ఏళ్లు, 20ఏళ్లు, 25 ఏళ్లలో ఎంత మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం..
15 ఏళ్లలో రూ. కోటి కార్పస్‌ను (15 ఏళ్ల కోటి ఫండ్) కూడబెట్టేందుకు మీరు సిప్‌లలో నెలకు రూ.20,016.81 పెట్టుబడి పెట్టాలి. మీ పెట్టుబడి రూ.36.03 లక్షలు అవుతుంది. ఎస్ఐపీపై గరిష్ట సగటు రాబడి 12శాతంగా ఉంటుంది.
20 ఏళ్లకు ప్రతి నెలా ఎంత SIP చేయాలి? :
20 ఏళ్లలో రూ. కోటి కార్పస్‌ను (20 ఏళ్ల ఒక కోటి ఫండ్) కూడబెట్టడానికి మీరు నెలకు రూ.10,108.61 ఎస్ఐపీ చేయాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి రూ.24.26 లక్షలు అవుతుంది.
25 ఏళ్లకు ప్రతి నెలా ఎంత SIP చేయాలి? :
25 ఏళ్లలో రూ. కోటి కార్పస్‌ను కూడబెట్టడానికి మీరు SIPలో నెలకు రూ. 5,322.41 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 25 ఏళ్ల వ్యవధిలో మొత్తం రూ.15.97 లక్షలు పెట్టుబడి పెడితే రూ.కోటి కార్పస్ ఈజీగా సంపాదించుకోవచ్చు.
Disclaimer : ఈ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు SIPలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి..
