FASTag Recharge : మీకు ఫాస్టాగ్ ఉందా? రీఛార్జ్ చేశారా? లేదంటే హైవేలో ఇక తప్పించుకోలేరు.. ఈ కొత్త రూల్‌తో ముక్కుపిండి వసూల్!
FASTag Recharge : మీకు ఫాస్టాగ్ లేకపోయినా లేదా రీఛార్జ్ చేయకపోయినా మీరు ఇప్పుడు భారీ మొత్తంలో టోల్ ఛార్జీలు చెల్లించాలి. టోల్ మొత్తానికి 1.25 రెట్ల వరకు చెల్లించాలి.
FASTag Recharge
- ఫాస్టాగ్ తీసుకోలేదా? రీఛార్జ్ చేయడం మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి
- రీఛార్జ్ ఫెయిల్ అయినా హైవేలో ప్రయాణానికి నో ఎంట్రీ
- ఫాస్టాగ్ కోసం క్యాష్ పేమెంట్లకు అనుమతి లేదు.. కేవలం డిజిటల్ పేమెంట్లు
- యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే టోల్ ఫీజుపై 1.25 రెట్లు చెల్లించాలి
FASTag Recharge : హైవేలపై వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి కొత్త టోల్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మీ వాహనానికి ఫాస్టాగ్ ఉందా? లేదంటే వెంటనే తీసుకోండి. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలి. లేదంటే భారీ మొత్తంలో పెనాల్టీలను చెల్లించక తప్పదు.
మీ దగ్గర ఫాస్టాగ్ లేకపోయినా లేదా సమయానికి రీఛార్జ్ చేయకపోయినా వెంటనే ఈ పనిచేయండి. ఎందుకంటే.. దేశీయ జాతీయ రహదారుల టోల్ వ్యవస్థలో భారీగా మార్పులు వచ్చాయి. అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది.
ఫాస్టాగ్ అనేది ఇప్పుడు హైవేలపై తప్పనిసరిగా మారింది. మీకు ఫాస్టాగ్ లేకున్నా UPI ద్వారా పేమెంట్ చేయొచ్చు. కానీ, ఆ పేమెంట్ టోల్ మొత్తానికి 1.25 రెట్లు ఉంటుంది. మీరు అసలు టోల్ బూత్‌కు వెళ్లకూడదనుకుంటే పేమెంట్ సమస్యలు ఉండొద్దన్నా మీరు వెంటనే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక నో ట్రాఫిక్ జామ్.. నో వెయిటింగ్ క్యూ :
కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లను పూర్తిగా రద్దు చేసి 100శాతం డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. టోల్ వసూలు ప్రక్రియను ఆటోమేట్ చేయడం వల్ల పొరపాట్లు, సమయం వృధా తగ్గుతాయి. తద్వారా టోల్ వసూలులో వంద శాతం పారదర్శకత ఉంటుంది.
మీ వాహనానికి ఫాస్టాగ్ లేకుంటే జరిగేది ఇదే :
క్యాష్ పేమెంట్లు ఇకపై అనుమతించరు. టోల్ ప్లాజాల వద్ద అన్ని లేన్లు కేవలం డిజిటల్ మెథడ్ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. మీ వద్ద వ్యాలీడ్ ఫాస్టాగ్ లేకపోతే మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ, మీకు టోల్ మొత్తానికి 1.25 రెట్లు (అదనంగా 25 శాతం సెస్) కూడా ఛార్జ్ అవుతుంది.
మీరు బ్లాక్‌లిస్ట్ అయిన ఫాస్ట్ ట్యాగ్‌తో లేదా కనీస బ్యాలెన్స్ లేకుండా ఫాస్టాగ్ లేన్‌లోకి ప్రవేశిస్తే.. మీకు రెట్టింపు టోల్ విధించవచ్చు. టోల్ ప్లాజా వద్ద డిజిటల్‌గా టోల్ చెల్లించడంలో ఫెయిల్ అయినా ఇ-నోటీసు జారీ అవుతుంది. 3 రోజులలోపు పేమెంట్ చేయకపోతే చెల్లించవలసిన మొత్తం రెట్టింపు అవుతుంది.
15 రోజుల కన్నా ఎక్కువ కాలం పేమెంట్ చేయకపోతే అది వాహన డేటాబేస్‌లో రిజిస్టర్ అవుతుంది. ఫలితంగా ట్రాన్స్ఫర్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ల వంటి వాహన సర్వీసులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు.. వ్యాలీడ్ డిజిటల్ పేమెంట్ అందుబాటులో లేకున్నా మీ వాహనాన్ని హైవేలోకి ఎంట్రీ కాకుండా అడ్డుకునే హక్కు అధికారులకు ఉంటుంది.
కొత్త క్యాష్ లెస్ విధానంతో టోల్ ఛార్జీలు మారుతాయా? :
2026-27 ఆర్థిక సంవత్సరానికి టోల్ ఛార్జీలను సవరించారు. వ్యాలీడ్ అయ్యే ఫాస్టాగ్ (FASTag) ఉన్నవారు స్టాండర్డ్ టోల్ రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి వార్షిక ఫాస్టాగ్ ధర రూ. 3వేల నుంచి రూ. 3,075కు అంటే రూ. 75 పెరిగింది. ఈ వార్షిక పాస్‌ను కార్లు, జీపులు వ్యాన్లతో సహా వాణిజ్యేతర వాహన యజమానులు వాడుతారు. మీరు యూపీఐ (UPI) ద్వారా చెల్లిస్తూ మీ వద్ద ఫాస్టాగ్ లేకపోతే మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
