Crorepati Mutual Fund
Crorepati Mutual Fund : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ అద్భుతంగా ఉంటాయి. చాలామంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టైమ్ పెట్టుబడులపై అద్భుతమైన రాబడులను పొందవచ్చు.
అందుకే ఎక్కువ మంది పెట్టుబడిదారులు SIPలో (Crorepati Mutual Fund) ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా మిలియనీర్ కావాలనుకుంటే ఇప్పటినుంచే ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి.
ఈ లాంగ్ టైమ్ ఇన్వెస్టమెంట్ ప్లాన్ ద్వారా భారీ మొత్తంలో కాంపౌండింగ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. కేవలం నెలకు రూ. 10వేల పెట్టుబడితో కొద్ది నెలల్లోనే కోటిశ్వీరుడు అయిపోవచ్చు. వాస్తవానికి, మార్కెట్లో అనేక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణ పెట్టుబడులపై భారీ మొత్తంలో కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.
ఇందులో ఒకటి ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (SBI LTEF). పెట్టుబడిదారులు అద్భుతమైన రాబడిని పొందవచ్చు. తద్వారా లక్షాధికారులుగా మారవచ్చు. SBI LTEF 1993లో ప్రారంభమైంది. ఈ పథకంలో ప్రారంభం నుంచే పెట్టుబడిదారుడు నెలవారీ రూ. 10వేలు SIP చేస్తూ ఉంటే.. మార్చి 28, 2025 నాటికి పెట్టుబడి సుమారు రూ. 14.44 కోట్లకు పెరిగి ఉండేది. ఎక్కువగా కార్పొరేట్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్. ప్రారంభం నుంచే ఈ ఫండ్ సుమారు 17.94శాతం సగటు వార్షిక రాబడిని (CAGR) అందించింది.
అద్భుతమైన రాబడితో పన్ను ఆదా :
SBI LTEF మంచి రాబడిని అందించడమే కాకుండా పన్నులను ఆదా చేసుకోవచ్చు. ELSS ఫండ్ ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పథకం ద్వారా రెండు విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. మంచి రాబడితో పాటు పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు.
రూ. 500తో పెట్టుబడి పెట్టండి :
ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు భారీ మొత్తంలో అవసరం లేదు. నెలకు రూ. 500 మాత్రమే SIP చేయొచ్చు. ఈ ఫండ్ AUM ప్రస్తుతం దాదాపు రూ. 27,730 కోట్లుగా ఉంది. పన్ను ఆదా చేసే ఫండ్ పొందవచ్చు. పెట్టుబడులు 3 ఏళ్ల పాటు లాక్ అవుతాయి. 3 ఏళ్ల తర్వాత మాత్రమే విత్‌డ్రా చేయవచ్చు.