How to Investment on SIP and PPF for Long Term Benefits
మీ జీతం తక్కువగా ఉందా? భవిష్యత్తులో ఎలా బతకాలా? అని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ.. ప్రస్తుతం మీకు జీతం తక్కువగా వచ్చినా సరే కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే రోజులన్నీ సంతోషంగా గడపవచ్చు. ఎలాంటి ఆర్థిక భారం కూడా ఉండదు. వాస్తవానికి, చాలా మంది ఆలస్యంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఎందుకంటే.. దానికి ప్రధాన కారణం.. వారి జీతం చాలా తక్కువగా ఉండటమే.
జీతంలో ఎక్కువ డబ్బు వారి అవసరాలకు ఖర్చు అవుతుంది. పొదుపు చేయడం వారికి సాధ్యం కాదు. కానీ, తక్కువ జీతంతో మీరు పొదుపు చేయలేరని కాదు. కుండ చుక్క చుక్క పడిన తర్వాతే అది నిండుతుంది అనే సామెతను మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
Read Also : RBI Repo Rate : లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ రేపో రేటు తగ్గించిందోచ్..!
తక్కువ డబ్బు ఉన్నా పెట్టుబడి పెట్టడం కష్టమైన పని కాదు. సరిగ్గా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మీరు ఆర్థికంగా లాభపడవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా.. సరైన పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించడమే. తద్వారా, మీరు మీ డబ్బును పెంచుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోకుండా జీవితం అంతా హాయిగా ఉండవచ్చు.
పెట్టుబడి పెట్టడానికి కొన్ని తెలివైన మార్గాలివే :
1. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) :
మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి (SIP) ఒక అద్భుమైన మార్గం. మీరు కోరుకుంటే కేవలం రూ. 500 లేదా రూ. 1000తో కూడా మీ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ ప్రారంభ సేవింగ్స్ కొన్ని సంవత్సరాలలో మీకు ఆర్థిక లాభాలను అందిస్తుంది.
తక్కువ రిస్క్, దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. మీరు SIP ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. సిప్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ పెట్టుబడిని పెంచుకుంటూ పోవచ్చు.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :
మీరు కనీసం రూ. 500తో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది. అంతేకాదు.. 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తుంది. దీని రాబడి కూడా స్థిరంగా ఉంటుంది. మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పీపీఎఫ్‌లో తక్కువ రిస్క్ ఉంటుంది.
3. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) :
ఈ పెన్షన్ విధానం (NPS) అనేది మీ పదవీ విరమణ కోసం డబ్బును దాచుకునే ప్రభుత్వ పథకం. మీరు ఈ ప్లాన్‌ను రూ. 500 నుంచి ప్రారంభించవచ్చు. ఈ విధానంతో పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత మీకు క్రమబద్ధమైన ఆదాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, ఆర్థిక భద్రతకు (NPS) ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
4. బంగారంపై పెట్టుబడి :
బంగారం అనేది ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. మీ దగ్గర తక్కువ డబ్బు ఉంటే.. సిస్టమాటిక్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SGIP) కింద ప్రతి నెలా తక్కువ మొత్తంలో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ సెక్యూరిటీలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. దాంతో మీరు బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నివారించవచ్చు. బంగారం భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది.
5. బాండ్లు :
బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడిని పొందవచ్చు. ప్రభుత్వ బాండ్లు సురక్షితమైన ఎంపిక. మీరు వాటిలో కనీస మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. బాండ్లు తక్కువ రిస్క్, స్థిరమైన రాబడిని అందిస్తాయి.
6. స్టాక్ మార్కెట్ :
మీరు తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీరు (SIP) ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్ కూడా. మీరు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తులో మంచి రాబడిని పొందవచ్చు. కానీ, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి రాబడి లభిస్తుంది. కానీ, రిస్క్ గురించి అవగాహన పెంచుకున్నాకే పెట్టుబడి పెట్టండి.