AP Inter Board Exam 2025 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

AP Inter Board Exam 2025 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

AP Inter Board Exam 2025

Updated On : February 7, 2025 / 11:26 AM IST

AP Inter Board Exam 2025 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్ష హాల్‌‌టిక్కెట్లు 2025 విడుదల చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు (bie.ap.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.

Read Also : RRB Group D : రైల్వేలో గ్రూపు-డి జాబ్స్ పడ్డాయి.. 32,438 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పది పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు..!

ఏపీ ఇంటర్ హాల్ టికెట్ 2025ని యాక్సెస్ చేసేందుకు విద్యార్థులు తమ పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్‌ను పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరుగుతాయి. అలాగే, థియరీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి మార్చి 20, 2025 వరకు జరుగుతాయి.

2025 ప్రాక్టికల్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ ఏపీ ఇంటర్ 2025 హాల్ టిక్కెట్లతో పాటు వారి ఐడీ కార్డులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. హాల్ టికెట్లు లేకుండా విద్యార్థులను పరీక్షా హాలులోకి ప్రవేశించేందుకు అనుమతించరు.

ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

  • విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసేందుకు ఏపీ ఇంటర్ అధికారిక వెబ్‌సైట్ (bie.ap.gov.in)కి వెళ్లాలి.
  • హోమ్‌పేజీలో ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లు 2025 లింక్ కోసం సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి.
  • మీ పుట్టిన తేదీ లేదా పేరు, దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేయండి.
  • ఆపై సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఏపీ ఇంటర్ హాల్ టికెట్ 2025 స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • అడ్మిట్ కార్డులో పేర్కొన్న అన్ని వివరాలను క్రాస్-చెక్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ చేసి ఆ హాల్ టికెట్ సేవ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

Read Also : RRB NTPC 2025 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష తేదీలపై ఉత్కంఠ.. ఎంపిక ప్రక్రియ, ఏ పోస్టుకు జీతం ఎంతో తెలుసా?

హాల్ టికెట్లలో చెక్ చేయాల్సిన ముఖ్య విషయాలివే :
ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లోని అన్ని వివరాలను క్రాస్-చెక్ చేసుకోవాలి. అందులో విద్యార్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు, పరీక్ష మాధ్యమం, పరీక్ష కేంద్రం పేరు, అడ్రస్, పరీక్ష తేదీ, సమయం, జిల్లా, అభ్యర్థి లింగం, కాలేజీ పేరు, పరీక్ష రోజు మార్గదర్శకాలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. అడ్మిట్ కార్డ్‌లో ఏదైనా తప్పు కనిపిస్తే.. పరీక్షలు ప్రారంభమయ్యే ముందు దాన్ని సరిదిద్దడానికి వారు వెంటనే ఏపీ బోర్డు లేదా వారి సంబంధిత కాలేజీని సంప్రదించాలి.