Credit Score : ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ లోన్లతో క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా? ఏం చేస్తే బెటర్?

Credit Score : ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ లోన్లతో క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏయే జాగ్రత్తలు తీసుకుంటే క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు..

Credit Score

Credit Score : ప్రస్తుత రోజుల్లో అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా లోన్లు తీసుకుంటారు. ఇంటి కోసం కావచ్చు.. ఆరోగ్యం కోసం కావొచ్చు..  (Credit Score) మొబైల్ ఫోన్లు, టీవీలు ఇలా ఏదో ఒక దానికోసం లోన్ తీసుకుంటారు.

అయితే, చాలా ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్ల పేరుతో లోన్లు అందిస్తున్నాయి. దాంతో చాలామంది అవసరానికి మించి లోన్ తీసుకోవడం చేస్తుంటారు. ఇలా ఎప్పుడు చేయొద్దు.

Read Also :  Vivo T3 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే వివో T3 అల్ట్రా ఫోన్.. సూపర్ డీల్..!

ఎందుకంటే.. ఇది మీ క్రెడిట్ స్కోరు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని మర్చిపోతుంటారు. కొన్నిసార్లు లోన్ అధిక మొత్తంలో తీసుకుని గడువు తేదీలోగా చెల్లించడం మానేస్తారు.

పేమెంట్ గడువు మిస్ అయినా : 
ఇలా కూడా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఏ లోన్ తీసుకున్నా సరే అది సకాలంలో చెల్లించినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ చెల్లించడం మిస్ అయితే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.

క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని అనుకోవచ్చు. అందులో నిజం లేదు. ఎలాంటి ఆలస్య రుసుములు, పెనాల్టీ లేకుండా అన్ని పేమెంట్లు సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు.

ఏదైనా ఆర్థిక సంక్షోభం ఎదురైతే చాలామంది ఇన్‌స్టంట్ లోన్ల కోసం చూస్తుంటారు. ఈ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లు ఇప్పుడు ఈజీగా అందుతున్నాయి. ఒకరకంగా ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు కానీ, తగినంత జాగ్రత్తగా ఉండకపోతే ఆన్‌లైన్ ఇన్ స్టంట్ లోన్ పొందడం కూడా మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది.

క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉండాలంటే? :
ఇలాంటి ఇన్‌‌స్టంట్ (Credit Score) లోన్లను తీసుకుంటే మీ క్రెడిట్ స్కోరు చెక్కుచెదరకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

ఇన్ స్టంట్ లోన్లు ఇచ్చే చాలా ఆన్ లైన్ ఫ్లాట్‌ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ సెక్యూర్డ్ లోన్లు ( పర్సనల్ లోన్లు) ద్వారా వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, ఇలాంటి లోన్లు క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తాయని గుర్తించాలి.

అదేపనిగా లోన్ ఎంక్వైరీలు, కొద్ది మొత్తంలో లోన్లు ఎక్కువ సార్లు తీసుకోవడం కూడా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఒకవేళ మీరు తీసుకున్న లోన్ చెల్లించడంలో విఫలమైతే డిఫాల్ట్ కారణంగా క్రెడిట్ స్కోరు ఒక్కసారిగా తగ్గిపోతుంది.

ఇన్ స్టంట్ లోన్లను తీసుకునే ముందు వడ్డీ రేట్లను ఓసారి చెక్ చేయండి. రుణం మొత్తాన్ని వడ్డీ రేట్లను సకాలంలో తిరిగి చెల్లించేలా ప్రణాళిక ఉండాలి. అధిక వడ్డీ రేట్లను తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఇన్ స్టంట్ పర్సనల్ లోన్లలో తక్కువ వడ్డీ రేట్లతో ఎంచుకోవాలి.

క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఉండాలంటే.. తీసుకున్న లోన్ వెంటనే తిరిగి చెల్లించడం.. ఇందుకోసం ముందుగా కొంత డబ్బును ఉంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో కూడా లోన్ గడువు తేదీ మిస్ కాకుండా చూసుకోండి.

తరచుగా లోన్లు తీసుకోవద్దు :
తరచుగా (Credit Score) లోన్లు తీసుకోవడం అసలు చేయొద్దు. ఎందుకంటే.. మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఎక్కువ మొత్తం ఇన్ స్టంట్ పర్సనల్ లోన్లు తీసుకోవడం కూడా మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే లోన్ తీసుకోవడం ఎంతైనా మంచిది.

Read Also : Apple iPhone 17 : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 సిరీస్ వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

మీరు తీసుకునే లోన్ యాప్స్ కూడా నమ్మదగినవా కాదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఫైనాన్స్ కంపెనీ ఏదైనా బ్యాంకుతో కానీ లేదా NBFC భాగస్వామ్యం కలిగి ఉందో లేదో కూడా చెక్ చేయండి.

ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఆయా లోన్స్ యాప్స్ గురించి చెక్‌ చేయండి. లోన్ తీసుకునే వారు తప్పకుండా రీ పేమెంట్ నిబంధనలు కూడా తెలుసుకోవాలి.