Vivo T3 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే వివో T3 అల్ట్రా ఫోన్.. సూపర్ డీల్..!
Vivo T3 Ultra 5G : వివో T3 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T3 Ultra 5G
Vivo T3 Ultra 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా లాంచ్ కానుంది. గత ఏడాదిలో (Vivo T3 Ultra 5G) వచ్చిన వివో T3 అల్ట్రా 5G ధర అమెజాన్‌లో భారీగా తగ్గింది.
వివో పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వివో T3 అల్ట్రా రూ. 27వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Read Also : Redmi Note 14 Pro : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఇలా చేస్తే రూ. 26వేల రెడ్‌మి ఫోన్ కేవలం రూ. 7వేలకే..!
ఈ ఫోన్ ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, ఓవల్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. అదనంగా, మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, కంపెనీ సిగ్నేచర్ ‘Aura Ring Light’ని కూడా కలిగి ఉంది. వివో T3 అల్ట్రా ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో వివో T3 అల్ట్రా 5G ధర :
వివో T3 అల్ట్రా 5G ఫోన్ 8GB, 128GB కాన్ఫిగరేషన్ లాంచ్ ధర రూ.31,999పై ఫ్లాట్ రూ.4వేలు తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.27,999కు అందిస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,250 బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. వివో T3 అల్ట్రా ఫోన్ ధర రూ.26,749కి తగ్గుతుంది.
అదనంగా, కొనుగోలుదారులు పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.26,550 వరకు ఆదా చేసుకోవచ్చు. రూ.1,357 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రాస్ట్ గ్రీన్, లూనార్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో T3 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
వివో T3 అల్ట్రా 5G ఫోన్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9200+ ప్రాసెసర్‌తో వస్తుంది.
12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్ OS1 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 80-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5500mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో T3 అల్ట్రా ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.