Human Jobs At Risk : మనుషులతో పనిలేదా? వచ్చే ఐదేళ్లలో ఏఐలదే ఆధిపత్యం.. ఆ జాబ్స్ చాట్‌బాట్‌లకే.. ఐబీఎం సీఈఓ ఏమన్నారంటే..?

Human Jobs At Risk : ప్రపంచమంతా ఏఐ చాట్‌బాట్స్ విషయంలో భయాందోళన మొదలైంది. రాబోయే రోజుల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీతో మనుషుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుందా? అందరిలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.

Human Jobs At Risk : మనిషి మేధస్సు ఒక అద్భుతం.. ఆ మనిషి తయారుచేసిన ఏఐ చాట్‌బాట్ అంతకన్నా పవర్‌ఫుల్.. మానవ మేధస్సును దాటిపోనుందా? చివరికి సృష్టించిన మనషుల మనుగడకే ముప్పు తీసుకురానుందా? రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందేమోననే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుత టెక్నాలజీకి తగినట్టుగా టెక్ కంపెనీలు సైతం ఏఐ చాట్‌బాట్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. మనిషి చేసే పనిని సెకన్ల వ్యవధిలోనే చేయగల సామర్థ్యం ఏఐ టెక్నాలజీకి ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలవు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చు.. అందుకే టెక్ కంపెనీలు ఏఐతో ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నాయి. ఏఐ ఉద్యోగాల విషయంలో అమెరికన్ టెక్ కంపెనీ IBM సీఈఓ అరవింద్ కృష్ణ (Arvind Krishna) సంచలన కామెంట్స్ చేశారు.

అమెజాన్ నుంచి అనేక కంపెనీలు AI బాటలోనే :
రాబోయే సంవత్సరాల్లో ఐబీఎం కంపెనీలో ఎంపిక చేసిన రోల్స్ నిలిపివేయనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. ఆయా రోల్స్‌లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలనుభర్తీ చేయాలని భావిస్తోందని తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో AI ద్వారా కొన్ని బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్‌లను భర్తీ చేయవచ్చని ఐబీఎం సీఈఓ సూచించారు. మనుషులు చేయాల్సిన ఉద్యోగాలను AI ద్వారా భర్తీ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)తో సహా అనేక కంపెనీలు హెచ్‌ఆర్ (HR) డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో AI చాట్‌బాట్‌లను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.

ఎందుకంటే.. IBM కంపెనీ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి మనుషుల స్థానంలో ఏఐ చాట్‌బాట్‌లను నియమించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించి చర్యలను కూడా ప్రకటించినట్టు నివేదిక పేర్కొంది. జనవరిలో ఐబీఎం దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది.

Read Also : Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!

వచ్చే ఐదేళ్లలో 30శాతం ఏఐ, ఆటోమేషన్‌తోనే భర్తీ..
ఓ ఇంటర్వ్యూలో ఐబీఎం సీఈఓ మాట్లాడుతూ.. ‘వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 30 శాతం (AI), ఆటోమేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఐబీఎంలో దాదాపు 26వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాబోయే ఏళ్లలో దాదాపు 7,800 ఉద్యోగాలను AI ద్వారా భర్తీ చేయవచ్చు. ఇప్పటికే ఐబీఎం దాదాపు 2లక్షల 60వేల మంది సిబ్బందిని నియమించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్-ఫేసింగ్ రోల్స్ కోసం నియామకాన్ని కొనసాగిస్తోంది.

ఒకవైపు కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నప్పటికీ.. మొదటి త్రైమాసికంలో సుమారు 7వేల మందిని నియమించింది’ అని ఆయన చెప్పారు. ఐబీఎం కంపెనీ 2023 ఏడాది ప్రారంభంలో రెండు బిజినెస్ యూనిట్లను స్పిన్ ఆఫ్, విక్రయించే ప్రణాళికలను ప్రకటించింది. ఆ వెంటనే కంపెనీలో ఉద్యోగాలను భారీగా తగ్గించింది. ఈ క్రమంలోనే ఏఐ ఉద్యోగాలపై ఐబీఎం కృష్ణ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Human Jobs At Risk _ IBM CEO expects to replace 7,800 jobs with AI in next 5 years

టెక్ కంపెనీల్లో ఏఐ ప్రాంప్ట్ మేనేజర్లు :
మరోవైపు.. కొత్త ఉత్పాదకతకు గురించి 2024 చివరి నాటికి సంవత్సరానికి 2 బిలియన్ డాలర్ల సేవింగ్ పెంచుతాయని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ భావిస్తున్నారు. ఓపెన్ఏఐ (OpenAI) ద్వారా చాట్‌జీపీటీ (ChatGPT), మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ (Bing Chat), గూగుల్ బార్డ్‌ (Google Bard AI)ను ప్రారంభించిన తర్వాత జనరేటివ్ AIపై ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించాయి. ఇప్పుడు అన్ని కంపెనీల దృష్టి ఏఐ టెక్నాలజీపైనే పడింది. భారత్ సహా ప్రపంచ దేశాల్లోని కొన్ని టెక్ కంపెనీలు AI చాట్‌బాట్‌లు అర్థం చేసుకోగలిగే కమాండ్స్ ద్వారా ఆఫీసుల్లో పనులను పూర్తి చేసేందుకు ప్రాంప్ట్ మేనేజర్‌లను కూడా నియమించుకుంటున్నాయి. వాస్తవానికి, ఉత్పాదకత పెరిగిన తర్వాత ఉద్యోగులకు చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లను గిఫ్ట్‌గా ఇవ్వాలని బెంగళూరు కంపెనీ నిర్ణయించింది.

ఏఐ టెక్నాలజీపై కంట్రోలింగ్ ఉండాల్సిందే :
అయితే, ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్‌ (Elon Musk)తో సహా కొంతమంది టెక్నాలజీ వ్యాపారవేత్తలు AIకి నిబంధనల విషయంలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా అవసరమని నమ్ముతున్నారు. మస్క్ 2023లో AI డెవలప్‌మెంట్‌లపై కొంత విరామం కోరుతూ బహిరంగ లేఖపై సంతకం చేశారు. మరోవైపు, (Google CEO) సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల AI 2023లో చాలామంది టెక్ ఉద్యోగాలను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా.. ఉద్యోగులకు ఎక్కువ సమయాన్ని ఆదా చేయడంలో ఈ ఏఐ టెక్నాలజీ సాయపడుతుంది. కానీ, ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి కచ్చితమైన కంట్రోలింగ్ అనేది ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే.. భవిష్యత్తులో పెను పరిణామాలకు దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు.

Read Also : Ola Electric Sales : ఓలా ఎలక్ట్రిక్ రికార్డు విక్రయాలు.. ఏప్రిల్‌లో 30వేలకు పైగా యూనిట్లు.. 40శాతం వాటా కైవసం..!

ట్రెండింగ్ వార్తలు