హైదరాబాద్ మరో ఘనత.. ఆరోసారి బెస్ట్ సిటీగా గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపర్చే ఫ్లై ఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది.

Hyderabad emerges as the best city to live in India For the 6th time

Hyderabad Best City: హైదరాబాద్ మరోసారి ది బెస్ట్ సిటీగా నిలిచింది. దేశంలోని మెట్రో నగరాలన్నింటినీ తలదన్ని మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా తొలిస్థానాన్ని దక్కించుకుంది. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్స్-2023 విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే.. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, బెంగళూరు, చెన్నై నగరాలున్నాయి.

ఇండియాలో సూపర్ సిటీ ఏదంటే హైదరాబాద్ అనేలా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపర్చే ఫ్లై ఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది. దానికి మించి బెస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందింది. 2015 నుంచి ఆరోసారి ఈ ఘనతను సాధించింది భాగ్యనగరం.

దేశంలోనే మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది హైదరాబాద్. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్-2023 విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 153వ స్థానం దక్కించుకున్న భాగ్యనగరం.. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 154వ ర్యాంక్‌తో పుణె, 155వ ప్లేస్‌తో బెంగళూరు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీ 4 నుంచి 7 ప్లేస్‌లలో నిలిచాయి.

Also Read: మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ లివబుల్ సిటీస్ జాబితాను మెర్సర్స్ కంపెనీ విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రియాలోని వియన్నా నగరం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సిటీకి ఉన్న చరిత్ర, అద్భుతమైన కట్టడాలు, సాంస్కృతికత వంటి కారణాలతో అత్యంత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలిచింది వియన్నా. ఇక స్విట్జర్లాండ్‌లోని జురిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.