Hyundai Car Prices : హ్యుందాయ్ కార్ల రేట్లు పెరగబోతున్నాయ్.. ఈ నెలాఖరు లోపు బుక్ చేసుకుంటే..!

Hyundai Car Prices : హ్యుందాయ్ కార్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. వచ్చే జూన్ నుంచి కార్ల ధరలు రూ. 12,800 పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ అంచనాల ఆధారంగా ఎంతవరకు ధరలు పెరగొచ్చంటే?

Hyundai Car Prices

  • జూన్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
  • క్రెటా, వెన్యూ, ఐ20, అల్కాజార్ వంటి పాపులర్ మోడళ్లు ఖరీదైనవి
  • జూన్ నుంచి కొనుగోలుదారులకు కొత్త ధరలు వర్తిస్తాయి

Hyundai Car Prices : కొత్త హ్యుందాయ్ కారు కొంటున్నారా? మీరు కొత్త హ్యుందాయ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోలోని మోడళ్ల ధరలను పెంచబోతోంది.

క్రెటా, వెన్యూ, ఐ20, అల్కాజార్ వంటి పాపులర్ మోడళ్లు ఖరీదైనవిగా మారవచ్చు. ధరల పెరుగుదల ఎంత ఉంటుంది? ఏయే కారు మోడళ్లపై ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 1, 2026 నుంచి (Hyundai Car Prices) అమల్లోకి వచ్చేలా మొత్తం ప్రొడక్టు రేంజ్ ధరల పెంపును ప్రకటించింది. ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాలు, ఇతర మేనేజ్‌మెంట్ ఖర్చులు నిరంతరం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్‌లో సుమారు శాతం ధరల పెంపును ప్రకటించగా ఇప్పుడు జూన్ 2026 నుంచి అమలు చేస్తోంది. మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపడం లేదని, అదనపు ఖర్చులలో కొంత భాగాన్ని మాత్రమే ధరలకు యాడ్ చేస్తున్నామని హ్యుందాయ్ చెబుతోంది.

ఉక్కు, అల్యూమినియం, ఎలక్ట్రానిక్ భాగాల ధరల పెంపుతో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోని అన్ని కంపెనీలపై ప్రభావం పడింది. ఏయే మోడళ్లు ఎంత వరకు పెరగొచ్చు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..

Read Also : Lava Shark 2 5G : 6000mAh బ్యాటరీ, 13MP కెమెరాతో లావా షార్క్ 2 5జీ వచ్చేసింది.. ధర చాలా చీప్ గురూ!

మోడల్ వారీ వృద్ధి అంచనాలివే :
హ్యుందాయ్ ప్రతి మోడల్‌కు కచ్చితమైన ధరల పెంపును అధికారికంగా ప్రకటించలేదు. కానీ, నిపుణులు, మార్కెట్ అంచనాల ఆధారంగా ఈ పెంపు ఇలా ఉండవచ్చు.

  • హ్యుందాయ్ క్రెటా : రూ. 8,000 నుంచి రూ.12,800 వరకు
  • హ్యుందాయ్ వెన్యూ: రూ. 6,000 నుంచి రూ.10,500 వరకు
  • హ్యుందాయ్ ఐ20: రూ. 5,500 నుంచి రూ.9,000 వరకు
  • హ్యుందాయ్ అల్కాజర్ : రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆరా : రూ. 4,000 నుంచి రూ.7,500 వరకు
  • హ్యుందాయ్ టక్సన్ ఐయోనిక్ 5: రూ. 10,000 నుంచి రూ. 12,800 వరకు

ధరల పెంపు అనేది కచ్చితమైన మొత్తం వేరియంట్‌పై (బేస్, మిడ్, టాప్) ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లకు పెరుగుదల తక్కువగా హై-ఎండ్ వేరియంట్‌లకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కార్ల ధరల పెంపు ఎందుకంటే? :
మే నెల నుంచి ధరలను సుమారు ఒక శాతం మేర పెంచుతామని కంపెనీ ఏప్రిల్‌లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. కానీ, మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని జూన్ ఒకటికి వాయిదా వేసింది. ఈ అదనపు ఖర్చు మొత్తాన్ని వినియోగదారులపై మోపడం లేదని, కేవలం కొంత భాగాన్ని మాత్రమే మోపుతామని హ్యుందాయ్ స్పష్టం చేసింది.

జూన్ నుంచి కొత్త ధరలు :
మే 31, 2026 లోపు బుకింగ్ చేసుకుని ఉంటే.. డెలివరీ పొందే కస్టమర్లు పాత ధరల బెనిఫిట్స్ పొందవచ్చు. జూన్ నుంచి కొనుగోలుదారులకు కొత్త ధరలు వర్తిస్తాయి. క్రెటా, వెన్యూ, ఐ20 అల్కాజర్ వంటి పాపులర్ హ్యుందాయ్ మోడళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.