ICICI Minimum Balance : కస్టమర్లకు బిగ్ షాక్.. ICICI బ్యాంక్ కొత్త రూల్.. ఇక సేవింగ్స్ ఖాతాలో రూ. 50,000 మినిమం బ్యాలెన్స్ మస్ట్..!
ICICI Minimum Balance : ఐసీఐసీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచుకోవాలి.

ICICI Minimum Balance
ICICI Minimum Balance : ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్. మీకు ఐసీఐసీఐ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? ఇది మీకోసమే.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో (ICICI Bank Rule) ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్ తీసుకొచ్చింది. సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిట్ భారీగా పెంచేసింది.
ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా రూ. 50 వేలకు పెంచేసింది. ఇప్పటివరకూ రూ. 10వేలు మినిమం బ్యాలెన్స్ లిమిట్ ఉండగా.. ఇప్పుడు అది కాస్తా 5 రెట్లు పెంచింది. తద్వారా సామాన్యులు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరవడం కష్టమే. ప్రత్యేకించి నగరాల్లోని వినియోగదారులకు భారీ మొత్తంలో ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచడం అనేది ఇబ్బందిగా మారవచ్చు.
రూ. 10వేలు కాదు.. రూ. 50వేలు ఖాతాలో ఉంచాల్సిందే :
ఎందుకంటే.. కనీస బ్యాలెన్స్ మెయింటైన్ (MAMB) చేయని ఖాతాలపై బ్యాంకు పెనాల్టీలను విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు నగరాల్లోని బ్రాంచుల్లో అకౌంట్ కలిగిన ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ (Savings Account)లో కనీసం రూ. 50,000 బ్యాలెన్స్ ఉంచుకోవాలి. గతంలో ఈ కనీస బ్యాలెన్స్ రూ. 10వేలు ఉండేది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 1, 2025 నుంచే అమల్లోకి వచ్చింది. కొత్తగా సేవింగ్స్ అకౌంట్లు తెరిచే అందరి కస్టమర్లకు ఇది వర్తిస్తుంది.
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతంటే? :
ఐసీఐసీఐ బ్యాంక్ చిన్న పట్టణాలు, గ్రామాల్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని కూడా పెంచింది. ఇప్పుడు చిన్న పట్టణాల్లోని కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ. 25వేలు ఉంచుకోవాలి. ఈ లిమిట్ గతంలో రూ. 5వేలుగా ఉండేది. అదేవిధంగా, గ్రామాల్లో కనీస బ్యాలెన్స్‌ను కూడా రూ. 10వేలకు పెంచింది. గతంలో రూ. 2500 మాత్రమే ఉండేది.
ICICI బ్యాంకు కనీస బ్యాలెన్స్ దేశంలోనే అత్యధికం. ఈ రూల్ ఫాలో అవ్వని కస్టమర్లపై 6శాతం లేదా రూ.500 చొప్పున ఏది తక్కువైతే అది పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2020 సంవత్సరంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) కనీస బ్యాలెన్స్ రూల్ రద్దు చేసింది.
అంతేకాదు.. ఇప్పుడు ICICI బ్యాంకు నగదు లావాదేవీల సర్వీస్ ఛార్జీలను కూడా సవరించింది. బ్రాంచులు, క్యాష్ రీసైక్లర్ మిషన్లలో డిపాజిట్ల కోసం కస్టమర్లకు నెలకు 3 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ప్రతి అదనపు లావాదేవీకి రూ. 150 వసూలు చేయనుంది.
రుసుము లేకుండా నెలవారీ రూ. లక్ష విలువ పరిమితితో అందుబాటులో ఉంటుంది. అంతకు మించి ప్రతి రూ. 1,000కి రూ. 3.5 లేదా రూ. 150 ఏది ఎక్కువైతే అంతా చెల్లించాలి. థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్లపై ప్రతి లావాదేవీకి రూ. 25వేలకు పరిమితం చేసింది.
బ్యాంకుల పని చేయని సమయాల్లో (సాయంత్రం 4:30 నుంచి ఉదయం 9:00 వరకు) సెలవు దినాల్లో క్యాష్ డిపాజిట్ మిషన్లు లేదా రీసైక్లర్ మిషన్ల ద్వారా చేసిన డిపాజిట్లపై ఒక నెలలో మొత్తం డిపాజిట్లు ₹10వేలు దాటితే అది కూడా సింగిల్ పేమెంట్ లేదా మల్టీ పేమెంట్లలో అయినా ప్రతి లావాదేవీకి రూ.50 చొప్పున ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జీలు స్టాండర్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్ రుసుములకు అదనంగా విధించనుంది.
ఇకపోతే, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి 6 మెట్రో నగరాల్లోని నాన్-ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలలో లావాదేవీలపై నెలలో మొదటి 3 ఉచితంగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 23 నుంచి ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.5 వసూలు చేస్తుంది. ఈ లిమిట్ ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీల మొత్తానికి వర్తిస్తుంది.