Iconic Yamaha RX100 reportedly coming back to India in new avatar
Yamaha RX100 New Avatar : అప్పట్లో యమహా యూత్ ఐకాన్.. ఈ యమహా బైక్ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో రయ్ రయ్ మనే సైరన్ మోగేది.. ఈ బైకుపై ఒక్కసారైన రయ్ రయ్ మనే శబ్దంతో రైడ్ చేయాలని ప్రతి కుర్రాడు ఆరాటపడేవాళ్లంటే అతిశయోక్తి కాదు.. అలాంటి బైకు కొన్ని అనివార్య కారణాలతో యమహా ఆర్ఎక్స్100 మార్కెట్లో అదృశ్యమైపోయింది.
అతి త్వరలో భారత్ మార్కెట్లోకి రీఎంట్రీ? :
ఆ తర్వాత ఇన్నాళ్లకూ అదే బైక్ మళ్లీ భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్టు మార్కెట్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ కూడా ఈ బైకుకు ఎలాంటి క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. నివేదికల ప్రకారం.. అతి త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్100 బైక్ రాబోతోంది. ఐకానిక్ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ టూవీలర్ తయారీదారు యమహా మళ్లీ భారత్‌లో కొత్త అవతార్‌లో RX100 బైక్ రీలాంచ్ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
కొత్త అవతార్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
అయితే, ఈసారి యమహా ఐకానిక్ ఆర్ఎక్స్100 కొత్త అవతార్‌లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. భారీ ఇంజిన్ పరిమాణంతో రానుంది. అంటే.. కొత్తబైకులో RX ఉంటుంది.. అయితే 100 వద్ద 225.9cc ఇంజిన్ అని ఉండవచ్చు. అత్యంత శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యంతో రానుంది. ఈ బైక్ ఇంజిన్ ఆకట్టుకునే 20.1బీహెచ్‌పీ పవర్, 19.93ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా BS6 ఫేజ్ 2 కఠినమైన ఉద్గారాలకు తగినట్టుగా డిజైన్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆర్ఎక్స్100 కొత్త అవతార్ గత మోడల్ బైక్ మాదిరిగా కొన్ని క్లాజిక్ డిజైన్ ఎలిమెంట్‌లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త యమహా బైక్ ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
Iconic Yamaha RX100 new avatar
ఆర్ఎక్స్100 బదులుగా ఆర్ఎక్స్225 ఉండొచ్చు? :
నివేదికల ప్రకారం.. రాబోయే యమహా బైక్ RX225 అనే పేరుతో వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇలాంటి నివేదికలు రావడం ఇదేమి మెదటిసారి కాదు.. 2022లోనూ యమహా Rx100 మళ్లీ రాబోతుందని వార్తలు వచ్చాయి. అప్పట్లో యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా ఆర్ఎక్స్100 మళ్లీ రానుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ఎక్స్100లో కొనసాగించే అదే మోనికర్ (పాత పేరు)ను అలాగే ఉంచుతుందని ఆయన చెప్పారు.
1980 నుంచి ఇప్పటివరకూ పాపులర్ అయిన బైకుల్లో యమహా RX100 మోస్ట్ పాపులర్ బైకు అని చెప్పవచ్చు. యమహా 1985 నుంచి 1996 వరకు టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. ఆ తర్వాత 2005 వరకు వివిధ కొత్త మోడళ్లలో ప్రవేశపెట్టింది. భారత ప్రభుతం దేశంలో కఠినమైన ఉద్గార నిబంధనలు అమలు చేయడంతో యమహా టూ-స్ట్రోక్ మోటార్‌సైకిళ్ల విక్రయాన్ని పూర్తిగా నిలిపివేసింది. అదే క్రమంలో యమహా కంపెనీ RX100 బైక్‌ను నిలిపివేసింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇదే బైకును కొత్త అవతార్‌లో కంపెనీ ప్రవేశపెట్టనుంది.