×
Ad

Railway Aadhaar Rule : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచే కొత్త ఆధార్ రూల్.. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..!

Railway Aadhaar Rule : అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్ మారనున్నాయి. ఆధార్ నిబంధనలు తప్పక తెలుసుకోండి..

Railway Aadhaar Rule

Railway Aadhaar Rule : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారా? ఇది మీకోసమే.. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ల బుకింగ్ విషయంలో కొత్త ఆధార్ రూల్ అమల్లోకి రానుంది. ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు భారతీయ రైల్వేలు అక్టోబర్ 1, 2025 నుంచి ఈ కొత్త నియమాన్ని అమలు చేయనున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. ఆధార్-అథెంటికెడ్ ఐఆర్‌సీటీసీ (Railway Aadhaar Rule) అకౌంట్లు ఉన్న ప్రయాణీకులు ఏదైనా రైలుకు రిజర్వేషన్ విండో ఓపెన్ చేసిన మొదటి 15 నిమిషాలలో మాత్రమే రిజర్వ్‌డ్ జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇంతకీ కొత్త రూల్ ఏంటి? ప్రయాణికులకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కొత్త మార్పు ఎందుకంటే? :
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. అసలైన ప్రయాణీకులకు టిక్కెట్లు న్యాయంగా లభించేందుకు ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. రిజర్వేషన్ ప్రారంభ నిమిషాలను తరచుగా అనధికార ఏజెంట్లు దుర్వినియోగం చేయడం చాలా కాలంగా ఆందోళనకు దారితీసింది. ఈ కీలకమైన సమయంలో ఆధార్-వెరిఫైడ్ యూజర్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు అనుమతించనుంది. తద్వారా, మోసపూరిత పద్ధతులను తగ్గి అసలైన ప్రయాణికులకు సీట్లు పొందడానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also : Upcoming Cars October : కొత్త కారు కొంటున్నారా? అక్టోబర్‌లో రాబోయే సరికొత్త కార్లు ఇవే.. ఫీచర్లు అదుర్స్.. ఇలాంటి కారు ఒక్కటైనా ఇంట్లో ఉండాల్సిందే..!

ఏయే రూల్స్ మారలేదంటే? :
కొత్త రూల్ రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆధార్ అథెంటికేషన్ లేకుండా ప్రయాణీకులు యథావిధిగా PRS కౌంటర్ల నుంచి టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా, అధికారిక రైల్వే ఏజెంట్లు మొదటి 10 నిమిషాల పాటు ప్రారంభ రోజు టిక్కెట్లను బుక్ చేసుకోకుండా నిషేధించే ప్రస్తుత రూల్ ఇంకా అమలులో ఉందని గమనించాలి.

కొత్త రూల్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? :
అక్టోబర్ 1, 2025 నుంచి ఆధార్-అథెంటికేటెడ్ ఐఆర్‌సీటీసీ అకౌంట్ వినియోగదారులు రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలలో ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేక యాక్సస్ కలిగి ఉంటారు. ఈ వ్యవధి తర్వాత ఆధార్ లింకేజీతో సంబంధం లేకుండా రిజిస్టర్డ్ యూజర్లందరికి ఒకే సిస్టమ్ ఓపెన్ అవుతుంది.

ఐఆర్‌సీటీసీ అకౌంటుతో ఆధార్‌ లింక్ చేయాలంటే? :
ఈ కొత్త రూల్ అమలులోకి రాకముందే ప్రయాణికులు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి.

IRCTC అకౌంట్లో లాగిన్ అవ్వడం ఎలా? :

  • “My Account”లోకి వెళ్లండి. ఆపై “Authenticate User” ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆధార్ లేదా వర్చువల్ ఐడీ వివరాలను ఎంటర్ చేయండి.
  • ఆధార్-లింక్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో వెరిఫికేషన్ చేయండి.

ప్రయాణీకులకు ముఖ్యమైన టిప్స్ :

  • ప్రముఖ రైళ్లలో టిక్కెట్లు త్వరగా అయిపోతాయి. బుకింగ్ విండో ఓపెన్ కాకముందే మీ లాగిన్‌ను రెడీగా ఉంచుకోండి.
  • స్పీడ్ ప్రాసెసింగ్ కోసం ప్రయాణ వివరాలను ముందుగానే అప్‌లోడ్ చేసి ఉంచుకోండి.
  • ఆధార్ అథెంటికేషన్ మొదటి 15 నిమిషాలు మాత్రమేనని గుర్తుంచుకోండి.
  • ఆ తర్వాత, సాధారణ బుకింగ్ రూల్స్ వర్తిస్తాయి.

1. నా అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయకపోయినా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చా?
అవును. ఆధార్ వెరిఫై కానీ యూజర్లు మొదటి 15 నిమిషాల తర్వాత టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

2. PRS కౌంటర్ నుంచి బుక్ చేసుకోవడానికి ఆధార్ అవసరమా?
లేదు. స్టేషన్ కౌంటర్లలో ఆధార్ అవసరం లేకుండానే బుకింగ్ చేసుకోవచ్చు.

3. ఈ కొత్త రూల్ తత్కాల్ టిక్కెట్లకు వర్తిస్తుందా?
లేదు. బుకింగ్ మొదటి 15 నిమిషాలలో సాధారణ రిజర్వ్డ్ టిక్కెట్లకే ఈ రూల్ పరిమితం.