iPhone 16 Offer
iPhone 16 Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ లేకుండానే రూ. 70వేల కన్నా తక్కువగా (iPhone 16 Offer) పడిపోయింది. బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ. 4వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా హ్యాండ్‌సెట్ ధరను మరింత తగ్గించవచ్చు. వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
భారత్‌లో ఐఫోన్ 16 ధర, లభ్యత :
ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 మోడల్ అసలు లాంచ్ ధర రూ. 79,900 నుంచి భారీగా తగ్గింది. అధికారిక రిటైలర్ల ద్వారా రూ. 72,400కు లభ్యమవుతుంది. అయితే, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ. 4వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 68,400కు తగ్గుతుంది. పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు ట్రేడింగ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 16 మోడల్ బ్లాక్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 మోడల్ A18 చిప్‌తో పాటు 8GB ర్యామ్, 128GB స్టోరేజీ కలిగి ఉంది. భారత్ సహా ఇతర దేశాల్లోనూ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 2 బ్యాక్ కెమెరాలు, 48MP వైడ్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ సెకండ్ జనరేషన్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఫిల్టర్‌లకు కూడా సపోర్టు ఇస్తుందని ఆపిల్ చెబుతోంది.
ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR (OLED) డిస్‌ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 2023లో ఐఫోన్ 15 ప్రోతో యాక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ iOS 18లో రన్ అవుతుంది. ఈ ఏడాది చివరిలో iOS 26కి అప్‌డేట్ అవుతుంది. 3,561mAh బ్యాటరీతో వస్తుంది. USB టైప్-C కేబుల్ లేదా MagSafe ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.