Oppo Reno 14 Series : ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియా లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo Reno 14 Series : ఒప్పో రెనో 14 సిరీస్ భారతీయ వేరియంట్ వస్తోంది. భారీ బ్యాటరీతో అనేక ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ వంటి ఫీచర్లతో రానుంది. పూర్తి వివరాలివే..

Oppo Reno 14 Series : ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియా లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo Reno 14 Series

Updated On : June 26, 2025 / 8:45 PM IST

Oppo Reno 14 Series : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో ఇండియా కొత్త ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. గత మే నెలలో చైనాలో (Oppo Reno 14 Series) ఆవిష్కరించిన ఈ లైనప్ భారత మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

రెనో 14 ప్రో 5G ఇండియన్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ లైనప్ 50MP మెయిన్ బ్యాక్ కెమెరాలు, అనేక ఏఐ-ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌తో వస్తుంది. ఒప్పో రెనో ప్రో వేరియంట్ 6,200mAh బ్యాటరీతో రానుంది.

జూలై 3న భారత మార్కెట్లో ఒప్పో రెనో 14 5G సిరీస్ లాంచ్ కానుందని ఒప్పో ధృవీకరించింది. ఈ లాంచ్ వర్చువల్‌గా జరుగుతుంది. మధ్యాహ్నం 12:00 IST గంటలకు ఒప్పో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. టెక్ బ్రాండ్ కొత్త రెనో 14 5G ఫోన్‌ల రాకను మైక్రోసైట్ ద్వారా ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫోన్ల లైనప్‌ కోసం వెబ్‌సైట్‌లలో స్పెషల్ వెబ్‌పేజీలను క్రియేట్ చేసింది.

ఒప్పో రెనో 14 5G సిరీస్ స్పెసిఫికేషన్లు :
చైనీస్ మోడల్ మాదిరిగానే ఒప్పో రెనో 14 ప్రో 5G ఇండియన్ వేరియంట్ రాబోతుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉండొచ్చు. ఇందులో 50MP OV50E 1.55-అంగుళాల సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 50MP OV50D సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనిల్లా ఒప్పో రెనో 14లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండొచ్చు.

Read Also : NPS Vatsalya vs SSY : పెట్టుబడి పెడుతున్నారా? NPS వాత్యల్స.. SSY స్కీమ్.. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ పథకం మంచిదంటే..?

1.95-అంగుళాల పిక్సెల్ సైజు, OIS సపోర్ట్‌తో 50MP సోనీ IMX882 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో ఆటోఫోకస్‌తో 50MP JN5 ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఏఐ వాయిస్ ఎన్‌హాన్సర్, ఏఐ ఎడిటర్ 2.0, ఏఐ రీకంపోజ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ స్టైల్ ట్రాన్స్‌ఫర్, ఏఐ లైవ్‌ఫోటో 2.0 వంటి మల్టీ ఏఐ ఆధారిత ఫీచర్లతో రానుంది.

భారత్‌లో ఒప్పో రెనో 14 5G సిరీస్ ధర (అంచనా) :
ఒప్పో రెనో 14 5G సిరీస్ ధర చైనా ధరలకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. గత మేలో చైనాలో ఒప్పో రెనో 14 5G ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర CNY 2,799 (సుమారు రూ. 33,200)తో లాంచ్ అయింది.

అయితే, రెనో 14 ప్రో 5G బేస్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర CNY 3,499 (సుమారు రూ. 41,500)గా ఉంది. ఇప్పుడు,
భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో ఒప్పో రెనో 14 సిరీస్‌లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. జూలై 1న సాయంత్రం 6 గంటలకు (IST మధ్యాహ్నం 3:30 గంటలకు) మలేషియాలో లాంచ్ కానున్నాయి.