iPhone 16 Discount
iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 సరసమైన ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16 కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. విజయ్ సేల్స్‌లో (iPhone 16 Discount) ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.12,400 కన్నా భారీగా తగ్గింపును పొందింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,900కి లాంచ్ ఈ ఐఫోన్ మరిన్ని అప్‌గ్రేడ్స్‌తో పాటు కొత్త పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్, iOS 16తో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లతో వచ్చింది. ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 16 ధర, డిస్కౌంట్లు, ఆఫర్లు :
ఐఫోన్ 16 కొనుగోలుపై భారీ మొత్తంలో సేవింగ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.71,490కు అందుబాటులో ఉంది. రూ.8,410 ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.4వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ధర కూడా రూ.67,490కి తగ్గుతుంది. ఈ డీల్ 128GB స్టోరేజ్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, పింక్, టీల్, అల్ట్రా మెరైన్, కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ (iPhone 16 Discount) 6.1-అంగుళాల OLED ప్యానెల్‌ను 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్ గరిష్ట బ్రైట్‌నెస్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ HDR డిస్‌ప్లే, ట్రూ టోన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ 3nm-ఆధారిత A18 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ఫ్యూజన్ సెన్సార్, 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP68 సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది.