iPhone 16 Plus Price
iPhone 16 Plus Price : దీపావళి పండగ వస్తోంది.. ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ప్రస్తుతం జియోమార్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.
ఈ పండుగ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన (iPhone 16 Plus Price) డీల్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు. సాధారణంగా ఐఫోన్‌లపై ఈ స్థాయిలో డిస్కౌంట్లు చాలా అరుదు. ఇలాంటి ఆఫర్లు కూడా ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16 ప్లస్ కోసం చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ ఐఫోన్ డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. కానీ, జియోమార్ట్ పండుగ ఆఫర్ సమయంలో ఐఫోన్ 16 ప్లస్ ధర ఇప్పుడు రూ. 67,990కి పడిపోయింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు రూ. 22వేలు తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్‌లు అదనంగా రూ. 8,500 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర కేవలం రూ. 59,490కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ట్రేడ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 30వేల కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఐఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌కు పవర్ ఆపిల్ A18 చిప్, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా ప్లస్ మోడల్, ఐఫోన్ 16 ప్లస్ 4674mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఐఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68-రేటెడ్, అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 16 ప్లస్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంది. విభిన్న లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన షాట్ తీయొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్ 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది.