EPFO New Rule : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఇకపై మీ PF డబ్బులు 100 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

EPFO New Rule : ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్‌డ్రా ప్రాసెస్ సులభతరమైంది. పీఎఫ్ ఖాతాలలో 100 శాతం ఫండ్స్ ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

EPFO New Rule : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఇకపై మీ PF డబ్బులు 100 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

EPFO New Rule

Updated On : October 15, 2025 / 1:49 PM IST

EPFO New Rule : దీపావళికి ముందు పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 70 మిలియన్లకు పైగా సభ్యులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఇటీవలే జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో పీఎఫ్ విత్‌డ్రా రూల్స్, అనేక కొత్త నిబంధనలపై నిర్ణయం తీసుకుంది.

కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన (EPFO New Rule) జరిగిన ఈ సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకున్నారు. ఇకపై పీఎఫ్ అకౌంటులో కనీస బ్యాలెన్స్ మినహా ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త విత్‌డ్రా లిమిట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదించింది.

ఈపీఎఫ్ఓ ​​సభ్యులు ఇప్పుడు తమ పీఎఫ్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ మినహా ఎంప్లాయ్, ఎంప్లాయిర్ కాంట్రిబ్యూషన్లతో సహా మొత్తం అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీస బ్యాలెన్స్ డిపాజిట్ చేసిన మొత్తం ఫండ్స్‌లో 25శాతం, 75శాతం విత్ డ్రా చేసుకోవచ్చు.

100 శాతం విత్‌డ్రా :

ప్రావిడెంట్ ఫండ్ నుంచి పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన రూల్స్ ఈపీఎఫ్ఓ ​​బోర్డు సులభతరం చేసింది. ఇకపై పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఎంప్లాయి, ఎంప్లాయిర్ ఫండ్స్ సహా తమ పీఎఫ్ అకౌంటు బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో పాక్షిక విత్‌డ్రా కోసం 13 ప్రత్యేక రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ నిబంధనలను ఈపీఎఫ్ఓ 3 కేటగిరీలుగా విభజించింది.

Read Also : Google Pixel 9 Pro Fold : ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ అదిరింది.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు.. డోంట్ మిస్!

ఎమర్జెన్సీ ఫండ్ :
అనారోగ్యం, విద్య, వివాహం వంటి ముఖ్యమైన అవసరాల కోసం ఇప్పుడు మీరు ఈపీఎఫ్ఓ నుంచి 100శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

గృహ సంబంధిత అవసరాలు :
ఇప్పుడు ఉద్యోగులు ఇల్లు కొనడానికి, ఇల్లు కట్టడానికి లేదా ఇంటి మరమ్మత్తుల కోసం కూడా ఈపీఎఫ్ఓ నుంచి నుండి 100 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్రత్యేక పరిస్థితులు :
ప్రకృతి వైపరీత్యాలు, లాక్‌డౌన్‌లు లేదా మహమ్మారి వంటి పరిస్థితులలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ ఫండ్స్ 100శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పరిస్థితులలో పీఎఫ్ సభ్యులు తమ ఫండ్స్ విత్‌డ్రా చేసేందుకు నిర్దిష్ట కారణాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.

విత్‌డ్రా లిమిట్స్‌, సర్వీసు టర్మ్ మార్పులివే :

ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఇప్పుడు విద్య కోసం విత్‌డ్రా లిమిట్స్ 10 సార్లు, వివాహం కోసం 5 సార్లుగా పెంచింది. గతంలో, పాక్షిక విత్‌డ్రా మొత్తం 3 సార్లు మాత్రమే అనుమతి ఉండేది. అన్ని విత్‌డ్రాలకు కనీస సర్వీసు వ్యవధి ఇప్పుడు 12 నెలలకు తగ్గించారు. ఈపీఎఫ్ఓ మరో కొత్త రూల్ కూడా అమల్లోకి తెచ్చింది. ఈ రూల్ ప్రకారం.. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం ఇప్పుడు తప్పనిసరిగా ఉండాలి. తద్వారా పీఎఫ్ సభ్యులు 8.25 శాతం అధిక వడ్డీ రేటు, రిటైర్మెంట్ వరకు సేవింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇకపై డాక్యుమెంట్లతో పనిలేదు :
కొత్త ఈపీఎఫ్ఓ రూల్ ప్రకారం.. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ అయింది. ఇకపై ఏవైనా డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. అన్ని పీఎఫ్ విత్‌డ్రాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఇంకా, ఫైనల్ ఈపీఎఫ్, పెన్షన్ విత్‌డ్రా గడువులను కూడా సవరించారు. ఫైనల్ ఈపీఎఫ్ విత్‌డ్రా వ్యవధిని 2 నెలల నుంచి 12 నెలలకు పొడిగించారు. ఫైనల్ పెన్షన్ విత్‌డ్రా వ్యవధిని రెండు నెలల నుంచి 36 నెలలకు పొడిగించాలని నిర్ణయించారు.

పెన్షన్ విత్‌డ్రా పొడిగింపు :
ప్రీమెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం అప్లయ్ చేసుకునేందుకు వెయింటింగ్ పీరియడ్ రెండు నెలల నుంచి 12 నెలలకు పెంచారు. ఫైనల్ పెన్షన్ విత్‌డ్రా ప్రక్రియ రెండు నెలల నుంచి 36 నెలలకు పెరిగింది. ఈ మార్పులు అత్యవసర సమయాల్లో ఆర్థిక సాయంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందిస్తుంది.

విశ్వాస్ స్కీమ్ ప్రారంభం :
విత్ డ్రా రీఫామ్స్‌తో పాటు వ్యాజ్యాలను తగ్గించేందుకు విశ్వాస్ పథకాన్ని ప్రారంభించారు. డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీసులతో ఈపీఎఫ్ఓ ​​3.0 ద్వారా ఈపీఎఫ్ఓ ​​సిస్టమ్ మోడ్రానైజేషన్ చేయడంపై కూడా సమావేశంలో ఈపీఎఫ్ఓ ఆమోదించింది.

ఈపీఎఫ్ఓ నుంచి 100 శాతం డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? :

1. మీ PF అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసేందుకు ఈపీఎఫ్ఓ (EPFO) ​​వెబ్‌సైట్ (https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface) విజిట్ చేయాలి.
2. ఆ తర్వాత మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.
3. ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసుకు వెళ్లి క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.
4. బ్యాంక్ అకౌంట్ నంబర్ చివరి 4 అంకెలను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌పై సైన్ చేయాలి.
5. ‘Proceed To Online Cliam’పై క్లిక్ చేయండి.
6. మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
7. అడ్రస్ వెరిఫికేషన్, OTP ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లెయిమ్‌ సమర్పించాలి.
8. క్లెయిమ్ సమర్పించిన తర్వాత మొత్తం డబ్బు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.