iPhone 16 Price
iPhone 16 Price : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అసలు లాంచ్ ధర కన్నా అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 భారీగా తగ్గడం ఇప్పుడే.. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కన్నా రూ. 10వేలు తక్కువకు లభ్యమవుతోంది.
అదనంగా, ఐఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అనేక బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 16 ఇప్పుడు 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధరకు సమానంగా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా భారీగా ధర తగ్గింది. ఐఫోన్ 16 అన్ని వేరియంట్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపు :
ఐఫోన్ 16 ఎంట్రీ లెవల్ 128జీబీ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999 ధరకు జాబితా అయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ మోడల్ ధర రూ.9,901 గణనీయంగా తగ్గింది.
అదనంగా, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కస్టమర్‌లు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఐఫోన్‌ను దాదాపు రూ.65వేల ధరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే రూ.60,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ముఖ్యంగా, ఐఫోన్ 15 మోడల్ 128GB వేరియంట్ ప్రారంభ ధర కూడా రూ.69,900గా నిర్ణయించింది. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత ఈ మునుపటి మోడల్ ధర రూ.10వేలు తగ్గింది. ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్‌లో ఐఫోన్ 15 రూ.64,999 ప్రారంభ ధరకు జాబితా అయింది. కొనుగోలుదారులు ఈ మోడల్‌ను కొనుగోలు చేసేటప్పుడు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల నుంచి కూడా బెనిఫిట్స్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ఫీచర్లు :
ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా (XDR OLED) డిస్‌ప్లే కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌కు సపోర్టుగా ఉంటుంది. ఈ ఐఫోన్ A18 బయోనిక్ చిప్‌సెట్, బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 16 లేటెస్ట్ iOS 18పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో వస్తుంది. ప్రత్యేకమైన క్యాప్చర్ బటన్‌తో కూడా కలిగి ఉంది. ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు మాత్రం ఆకర్షణీయమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.