iPhone 16e sale begins soon
iPhone 16e Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ఇటీవలే లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16e ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 28న ఈ ఐఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.
అద్భుమైన ఫీచర్లతో మల్టీ ట్రేడ్-ఆఫ్‌లు, ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో సహా అనేక ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో వస్తోంది. ఈ కొత్త ఐఫోన్ ధర రూ. 59,900కు అమ్మకానికి రానుంది. మీరు ఈ ఐఫోన్ 16e కొనుగోలు చేసే ముందు 5 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16e ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ ఐఫోన్ 16e మోడల్‌కు సింగిల్ కెమెరా మాత్రమే ఉంది. అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్ లేవు. రూ. 60వేల ధరలో ఫీచర్ల పరంగా అంతగా ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. ఐఫోన్ 16e ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీని మాత్రం కలిగి ఉంది. ఐఫోన్ 16 వంటి ఫోన్‌లలో కూడా ఈ ఫీచర్ ఉంది. 2x ఫోకల్ లెంగ్త్ వద్ద ఆప్టికల్-క్వాలిటీ జూమ్ షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు.
ఇందులో టెలిఫోటో లెన్స్ అవసరం ఉండదు. అది ఉంటే అల్ట్రా-వైడ్ ఉండదు. ఐఫోన్ 16 మాదిరిగానే 48ఎంపీ షూటర్ ఉంది, 4K 60fps డాల్బీ విజన్ వీడియోను షూట్ చేసేలా బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. అయితే, ఇందులో సినిమాటిక్ మోడ్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లేవు. డైనమిక్ ఐలాండ్ లేదు. మిగిలిన ఐఫోన్ 16 సిరీస్‌ల మాదిరిగానే, ఐఫోన్ 16e డైనమిక్ ఐలాండ్ అందించలేదు. ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సహా ఐఫోన్ X నుంచి అన్ని మోడళ్లలో కనిపించే నాచ్ మాత్రమే ఉంది.
ఒకవేళ, ఐఫోన్ 16e మోడల్ ఫేస్ ఐడీతో ఉంటే డైనమిక్ ఐలాండ్ యానిమేషన్లను పొందలేరు. మొత్తం డిజైన్ ఐఫోన్ 13, 14 మాదిరిగానే ఉంటుంది. మీరు ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 నుంచి కెమెరాను వద్దనుకుంటే.. ఐఫోన్ 16e కెమెరా కూడా దాదాపు ఒకేలా ఉంటుంది.
అదే 6.1-అంగుళాల డిస్‌ప్లే, అల్యూమినియం ఫ్లాట్ సైడ్‌లు, ఫ్లాట్ బ్యాక్ ఫ్రంట్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 12 సిరీస్ నుంచి ఐఫోన్‌లలో ఫ్లాట్-సైడెడ్ డిజైన్ ఇష్టపడేవారికి బెస్ట్ అని చెప్పవచ్చు. మరికొంతమంది కర్వడ్ సైడెడ్ డిజైన్ కూడా ఇష్టపడతారు.
ఐఫోన్ 16 మాదిరిగా ప్రాసెసర్ :
పవర్‌ఫుల్ ప్రాసెసర్ కావాలంటే ఐఫోన్ 16e బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే.. ఆపిల్ A18 చిప్‌సెట్ ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఆపిల్ కచ్చితమైన ర్యామ్ సామర్థ్యాన్ని వెల్లడించలేదు. 8జీబీ ర్యామ్ ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే.. ఐఫోన్ 16e ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్‌లో ఆపిల్ ఏఐ ఫీచర్లను కూడా యాక్సస్ చేయొచ్చు.
ఐఫోన్ 16e తక్కువ ధరకు ఎలా పొందాలి? :
ఐఫోన్ 16e బేస్ మోడల్ ఆపిల్ వెబ్‌సైట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రూ. 59,900కు రిటైల్ అవుతోంది. బెస్ట్ డీల్ కోసం కార్డ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఉదాహరణకు.. అమెజాన్‌లో ఎంపిక చేసిన కార్డులపై రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధర రూ. 55,900కి ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.