Sukanya Samriddhi Yojana : ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెడితే చాలు.. మీ కూతురి పెళ్లినాటికి రూ. 69 లక్షలపైనే చేతికి అందుతాయి..!

Sukanya Samriddhi Yojana : కూతురి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన పథకం ఒకటి అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెడితే మీ అమ్మాయి పెళ్లి నాటికి డబ్బులు చేతికి అందుతాయి.

Sukanya Samriddhi Yojana : ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెడితే చాలు.. మీ కూతురి పెళ్లినాటికి రూ. 69 లక్షలపైనే చేతికి అందుతాయి..!

Sukanya Samriddhi Yojana

Updated On : February 27, 2025 / 3:21 PM IST

Sukanya Samriddhi Yojana : కూతురు పుట్టగానే చాలామంది తల్లిదండ్రుల్లో వారి భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆందోళన కనిపిస్తుంటుంది. కూతురు ఎదుగుతున్న కొద్ది వారి చదువు, పెళ్లి కోసం అనేక ప్రణాళికలు వేస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు.. కొన్నిసార్లు ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం చూసి.. తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం, చదువు గురించి అదేపనిగా ఆలోచిస్తుంటారు. కూతురు చిన్నప్పుడే వారి భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయడం కూడా చేస్తుంటారు.

Read Also : Apple iOS 18.4 : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. iOS 18.4లో వండర్‌ఫుల్ ఫీచర్స్ ఇవే.. ప్రతి ఫీచర్‌కు ఓ స్పెషాలిటీ..!

మీరు కూడా మీ కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు ఇప్పుడే మీ కూతురి పేరు మీద పెట్టుబడి పెట్టడం బెటర్. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మీ కూతురు పెరిగే సమయానికి మీరు పెద్ద మొత్తంలో డబ్బులను కూడబెట్టుకోవచ్చు.

అంతా బాగానే ఉంది.. ఇంతకీ పెట్టుబడి ఎలా పెట్టాలి? అని అనుకుంటున్నారా? ప్రస్తుతం పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అందిస్తోంది. ఈ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం (SSY) ఒకటి. ఈ పథకం ద్వారా ఇప్పటినుంచే మీ కూతురి భవిష్యత్తు కోసం కొద్దికొద్దిగా పెట్టుబడి పెడుతూ పోవాలి. మీ అమ్మాయి పెళ్లి నాటికి ఈ డబ్బులు చేతికి అందుతాయి. ఇంతకీ ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి పథకం ఏంటి? :
సుకన్య సమృద్ధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం. ఈ పథకంలో ఆడపిల్లలకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం లక్ష్యం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేయడమే. సుకన్య సమృద్ధి యోజన కింద తల్లిదండ్రులు తమ కుమార్తెల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా భారీగా డబ్బులను కూడబెట్టుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీ రేటుతో రాబడిని అందిస్తుంది.

ఎవరిపై ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
సుకన్య సమృద్ధి యోజనలో 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న కూతురి పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి ఏడాదిలో రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండినప్పుడు ఈ పథకం మెచ్యూరిటీని అందిస్తుంది.

ఇలా పెట్టుబడితో రూ. 46 లక్షల వడ్డీ :
సుకన్య సమృద్ధి యోజన కింద మీ కుమార్తె పేరు మీద ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అంటే.. 15 సంవత్సరాలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22 లక్షల 50వేలు అవుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ పరంగా మొత్తం రూ. 69,27,578 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.

ఇందులో కేవలం వడ్డీనే రూ. 46,77,578 వరకు పొందవచ్చు. మీరు కూడా మీ కూతురి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇప్పుడే ఈ పథకంలో చేరి పెట్టుబడిని ప్రారంభించండి. సరిగ్గా 15ఏళ్ల వరకు మీ పెట్టుబడిని కొనసాగించండి.. ఆపై అధిక మొత్తంలో రాబడిని పొందవచ్చు.

అర్హతలివే :

  • అమ్మాయి తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఓపెన్ చేయొచ్చు
  • ఆడపిల్ల వయస్సు 10 సంవత్సరాల లోపు ఉండాలి
  • ఒక ఆడపిల్లకు ఒక అకౌంట్ మాత్రమే
  • ఒక ఫ్యామిలీకి 2 SSY స్కీమ్ అకౌంట్లు మాత్రమే అనుమతి

ఎలా పెట్టుబడి పెట్టాలి :

  • పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి పథకానికి పోస్టాఫీసులు లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను తప్పనిసరిగా జత చేయాలి.
  • ఆడపిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
  • దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల ఫోటో ఐడీ
  • దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల అడ్రస్ ప్రూఫ్
  • పాన్ , ఓటరు ఐడీ వంటి ఇతర కేవైసీ డాక్యుమెంట్లు

Read Also : AI Job Offer : కాలేజీ సర్టిఫికెట్లు అక్కర్లేదు.. రెజ్యూమ్ రిచ్‌‌గా ఉండాల్సిన పనిలేదు.. మీకు స్కిల్ ఉంటే చాలు.. రూ.40లక్షల శాలరీ ఆఫర్ చేస్తున్న కంపెనీ

ఎలా దరఖాస్తు చేయాలి? :

  • ఆడపిల్ల తల్లిదండ్రులు పూర్తి వివరాలతో ఫారమ్ నింపండి.
  • ప్రాథమిక ఖాతాదారు : ఆడపిల్ల పేరు
  • జాయింట్ హోల్డర్ : తల్లిదండ్రుల పేరు
  • ప్రారంభ డిపాజిట్ మొత్తం
  • ప్రారంభ డిపాజిట్ కోసం చెక్కు/డీడీ నంబర్, తేదీ
  • జనన ధృవీకరణ పత్రం వివరాలతో పాటు ఆడపిల్ల పుట్టిన తేదీ
  • తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వంటివి)
  • ప్రస్తుత, పర్మినెంట్ అడ్రస్ (తల్లిదండ్రుల ఐడీ డాక్యుమెంట్ ప్రకారం)
  • పాన్, ఓటరు ఐడీ కార్డు మొదలైన ఇతర కేవైసీ డాక్యుమెంట్ల వివరాలు