Apple iOS 18.4 : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. iOS 18.4లో వండర్‌ఫుల్ ఫీచర్స్ ఇవే.. ప్రతి ఫీచర్‌కు ఓ స్పెషాలిటీ..!
Apple iOS 18.4 : ఆపిల్ అధికారికంగా iOS 18.4, iPadOS 18.4 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనుంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ తీసుకువస్తుంది.

Apple says iOS 18 rollout
Apple iOS 18.4 : ఆపిల్ యూజర్లకు పండగే.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ అధికారికంగా iOS 18.4, iPadOS 18.4 రిలీజ్ చేస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో ఈ రెండూ రిలీజ్ అవుతాయని కంపెనీ
ధృవీకరించింది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసమే ఈ కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను తీసుకువస్తుంది.
రాబోయే ఈ రెండు అప్‌డేట్స్ ఇప్పటికే ఫస్ట్ బీటాలో డెవలపర్‌లు, పబ్లిక్ టెస్టర్‌లకు అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ రిలీజ్ సమయంలో మరికొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. ఇందులో ప్రత్యేకించి ఆహార ప్రియుల కోసం సరికొత్త సెక్షన్, నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. iOS 18.4లో అత్యుత్తమ ఫీచర్లలో ఆపిల్ న్యూస్ యాప్‌లోని స్పెషల్ సెక్షన్ ఉంటుంది. అదే.. ఆపిల్ న్యూస్+ ఫుడ్ (Apple News+ Food) అనమాట.
Read Also : Bus Ticket : అయ్యో.. భలే పనైందిగా.. బస్ కండెక్టర్ దగ్గర టికెట్ డబ్బులు మర్చిపోయారా? ఈ పనిచేయండి చాలు..!
ప్రత్యేకంగా ఆపిల్ న్యూస్+ సబ్‌స్క్రైబర్‌ల కోసం ఈ ఫీచర్ రూపొందించింది. తద్వారా ఆపిల్ యూజర్లు బాన్ అప్పెటిట్, ఫుడ్, వైన్, ఆల్ రెసిపీస్ వంటి టాప్ ఫుడ్ పబ్లీషర్ల నుంచి వేలాది వంటకాలకు యాక్సెస్ చేయొచ్చు. కానీ, ఈ సెక్షన్‌లో కేవలం వంటకాలు మాత్రమే కాదు.. రెస్టారెంట్లు, హెల్తీ ఫుడ్ టిప్స్, కిచెన్ ఎసెన్స్‌సియల్స్ వంటి మరెన్నో స్టోరీలు ఉన్నాయి.
ఆపిల్ వంటకాలను బ్రౌజ్ చేయడం, సెర్చ్ చేయడం, ఫిల్టర్ చేయొచ్చు. వంటకాలకు సంబంధించి ఫుల్ స్క్రీన్‌లో వీక్షించేందుకు న్యూ కుక్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. వంట చేసేటప్పుడు ఆయా వీడియోలను ఈజీగా ఫాలో చేయొచ్చు. తమకు ఇష్టమైన వంటకాలను ఆఫ్‌లైన్‌లో చూసేందుకు సేవ్ చేసుకోవచ్చు.
ఈ ఐఫోన్లలోనే సపోర్టు :
iOS 18.4లో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ప్రియారిటీ నోటిఫికేషన్ ఫీచర్.. మీ లాక్ స్క్రీన్‌పై ముఖ్యమైన నోటిఫికేషన్‌లను ఆటోమాటిక్‌గా డిస్‌ప్లే చేస్తుంది. ఈ ఫీచర్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. అయితే, ఈ ఫీచర్ iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 16 సిరీస్‌లకు మాత్రమే పరిమితమని గమనించాలి.
ఇక, కంట్రోల్ సెంటర్‌లోని కొత్త యాంబియంట్ మ్యూజిక్ ఫీచర్ కూడా ఉంది. ఇది సంగీత ప్రియులకు బెస్ట్ అని చెప్పవచ్చు. స్లీప్, చిల్, ప్రొడక్టివిటీ, వెల్‌బీయింగ్ అనే నాలుగు కేటగిరీలలో క్యూరేటెడ్ సాంగ్స్ సెలెక్షన్ ద్వారా క్విక్ ప్లే చేయొచ్చు.
యూరోపియన్ యూనియన్‌లోని యూజర్ల కోసం iOS 18.4 మ్యాప్‌లు, ట్రాన్సులేషన్ వంటి డిఫాల్ట్ యాప్‌లను అందిస్తుంది. మీరు ఇప్పుడు మీ డిఫాల్ట్ నావిగేషన్ సాధనంగా (Google Maps) లేదా మరో సంబంధిత యాప్‌ను ఎంచుకోవచ్చు.
ఏయే భాషల్లో సపోర్టు ఉందంటే? :
iOS 18.4 అప్‌డేట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు చేసే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, చైనీస్ సహా మరిన్ని భాషలకు విస్తరిస్తుంది. అదనంగా, ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్‌లో కొత్త స్కెచ్ డ్రాయింగ్ స్టైల్ ఉంది. ఇప్పటికే ఉన్న యానిమేషన్, ఇలస్ట్రేషన్ స్టైల్స్‌ను అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ టూల్ యూజర్లను టెక్స్ట్ ఇన్ఫోల ఆధారంగా ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు.
Read Also : Instagram New App for Reels : ఇన్‌స్టాగ్రామ్ సంచలనం.. రీల్స్ కోసం కొత్త యాప్?
iOS 18.4 అప్‌డేట్‌లో కొత్త బ్యాచ్ ఎమోజీలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రతి మెయిన్ అప్‌డేట్‌తో కొత్త అక్షరాలను చేర్చే సంప్రదాయాన్ని ఆపిల్ కొనసాగిస్తుంది. ఫుల్ లిస్టు ఇంకా రివీల్ చేయనప్పటికీ, గత ఏడాదిలో యూనికోడ్ కన్సార్టియం ప్రివ్యూ వంటి అనేక ఆప్షన్లను అందించింది.
విజన్ ప్రో యాప్ :
ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం విజన్ ప్రో యాప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ యాప్ విజన్ ప్రో యూజర్లు తమ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపిల్ టీవీ కంటెంట్ కూడా యాక్సెస్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.