Bus Ticket : అయ్యో.. భలే పనైందిగా.. బస్ కండెక్టర్ దగ్గర టికెట్ డబ్బులు మర్చిపోయారా? ఈ పనిచేయండి చాలు..!
RTC Bus Ticket : టికెట్ తీసుకున్నాక సరిపడా చిల్లర ఇవ్వకపోతే కండెక్టర్ దాని వెనుక మిగతా ఇవ్వాల్సిన డబ్బులను రాస్తుంటారు. ఆ డబ్బులను అడిగి తీసుకోవడమ మర్చిపోతే ఇలా ఈజీగా మీ డబ్బులను తిరిగి తెచ్చుకోవచ్చు.

Collect Ticket Change
RTC Bus Ticket : బస్సులో ప్రయాణించేవారికి అలర్ట్.. బస్సు ఎక్కినప్పుడు చాలామంది టికెట్ తీసుకున్నాక చేంజ్ తీసుకోవడం మర్చిపోతుంటారు. సాధారణంగా ప్రతిఒక్కరికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ప్రయాణ సమయంలో తొందరపాటుతో మర్చిపోతుంటారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు తమ ప్రయాణానికి సరిపడా చిల్లర ఇవ్వకపోవడంతో బస్ కండక్టర్లు మిగతా డబ్బులను టికెట్ వెనుక రాసి ఇస్తుంటారు. అయితే, చాలామంది ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకున్నాక టికెట్ వెనుక రాసిన మిగతా డబ్బులను తీసుకోవడం మర్చిపోతుంటారు.
ఇంటికి వెళ్లాలనే కంగారులో గబగబ దిగేసి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత బస్సు టికెట్ వెనుక డబ్బులు తీసుకోలేదనే విషయం గుర్తుకొచ్చి ఆందోళన చెందుతుంటారు. అయ్యో డబ్బులు తీసుకోలేదని తెగ బాధపడిపోతుంటారు. మరికొంతమంది పోతే పోయాయిలే అని లైట్ తీసుకుంటారు.
ఒకవేళ మీరు కూడా బస్సు ప్రయాణంలో టికెట్ వెనుక రాసిన డబ్బులను తిరిగి తీసుకోవడం మర్చిపోతే కంగారు పడక్కర్లేదు. ఆ బస్సు మిస్ అయినా పర్వాలేదు. మీరు ఒక పని చేస్తే చాలు.. మీ దగ్గర ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ టికెట్‌పై హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది చూడండి..
Read Also : Gold Rates Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంతో తెలుసా?
ఆ హెల్ప్ లైన్ నెంబర్ 040-69440000 కు సమాచారం అందించాలి. మీరు ఈ నెంబర్ కు సమాచారం ఇచ్చినట్టయితే మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. ఎలాగంటే.. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆర్టీసీ అధికారులు విచారణ చేసి మీ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తారు అనమాట..
ఇంకెందుకు ఆలస్యం.. మీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే.. టికెట్ పై ఉన్న హెల్ప్ లైన్‌కు సమాచారం అందించండి.