Gold Rates Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంతో తెలుసా?
Gold Prices Today : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today
Gold Rates Today : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. గత రెండు రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోంది. బంగారం కొనేవారు ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత్‌లోనే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫిబ్రవరి 27, 2025 (ఈరోజు) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,530కి తగ్గింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,250 పైన ట్రేడవుతోంది. అంటే.. కేవలం రూ. 10 మధ్య ఈ రోజు స్వల్పంగా పసిడి ధరలు తగ్గాయి. ఇక వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఒక కిలో వెండి ధర రూ.98,000 వద్ద ట్రేడవుతోంది. దేశీయ ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? :
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,530 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,250 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, చెన్నై నగరాల్లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,810 వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,490 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 98,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇతర నగరాల్లో ఒక్క చెన్నైలోనే రూ. రూ.1,06,000 ఉండగా, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.98వేల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా :
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,380 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.1,06,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు బంగారం ధరలు రూ. 400 నుంచి రూ. 440 మధ్య తగ్గాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో కిలో వెండి ధరలు కూడా రూ.1,06,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.