Instagram New App for Reels : ఇన్‌స్టా‌గ్రామ్ సంచలనం.. రీల్స్ కోసం కొత్త యాప్?

Instagram New App for Reels : నివేదికల ప్రకారం.. టిక్‌టాక్ అమెరికాలో సంక్షోభం నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ షార్ట్-వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ రీల్స్ కోసం సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. అదేగానీ వస్తే.. ఇక రీల్స్ రప్పా రప్పా చేసుకోవచ్చు..

Instagram New App for Reels : ఇన్‌స్టా‌గ్రామ్ సంచలనం.. రీల్స్ కోసం కొత్త యాప్?

Instagram New App for Reels

Updated On : February 27, 2025 / 12:57 PM IST

Instagram Reels : టిక్‌టాక్ పోటీగా ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త యాప్‌తో వస్తోంది. ఒకవైపు అమెరికాలో ఉనికిని చాటుకునేందుకు టిక్‌టాక్ తంటాలు పడుతున్న తరుణంలో మెటా సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యూజర్ల కోసం కొత్త యాప్ తీసుకురానుంది.

అయితే, అమెరికా ప్రభుత్వ డిమాండ్లకు కట్టుబడని పక్షంలో ఆ దేశంలో పూర్తిగా టిక్‌టాక్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు, ప్రత్యర్థికి పోటీగా ఇన్‌స్టాగ్రామ్ షార్ట్-ఫామ్ వీడియో ఫీచర్ రీల్స్ కోసం స్పెషల్ యాప్‌ను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. నివేదికల ప్రకారం.. అమెరికాలో టిక్‌టాక్ మాదిరిగా ఇన్‌స్టాగ్రామ్ వీడియో-స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. తద్వారా ఇన్‌‌స్టా యూజర్లు రప్పా రప్పా రీల్స్ చేసుకోవచ్చు అనమాట.

Read Also : Gold Rates Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంతో తెలుసా?

అయితే, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ ప్లాన్ చేయడం.. ఆపై యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు. గత జనవరిలో మెటా ఎడిట్స్ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని పాపులర్ వీడియో ఎడిటింగ్ యాప్ క్యాప్‌కట్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

2018లో టిక్‌టాక్‌తో పోటీ పడే ప్రయత్నంలో మెటా వీడియో షేరింగ్ యాప్ లాస్సోను కూడా ప్రవేశపెట్టింది. కానీ, ఈ యాప్ పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరికి యాప్ సేవలను నిలిపివేసింది. కానీ, ఇప్పుడు, టిక్‌టాక్ సంక్షోభ సమయాన్ని మెటా సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. అయితే, అసలు అమెరికాలో టిక్‌టాక్‌కు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందో ఓసారి చూద్దాం.

అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ ఎందుకంటే? :
టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌కు చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని, అమెరికన్ యూజర్ల లొకేషన్, ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు వంటి సున్నితమైన డేటాను సేకరిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను విక్రయించాలని అక్కడి అధికారులు బైట్‌డాన్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

అయితే, సుప్రీంకోర్టు నిషేధాన్ని రద్దు చేయకపోతే కంపెనీ దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 27, 2025 నాటికి, యునైటెడ్ స్టేట్స్‌లో టిక్‌టాక్ పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. చైనీస్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌ యూఎస్ కార్యకలాపాలను విక్రయించాలని కోరుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత జనవరి 19, 2025న ఈ ప్లాట్‌ఫామ్‌ను అమెరికా ప్రభుత్వం నిషేధించింది.

తాత్కాలిక నిషేధమే :
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన 24 గంటల్లోనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు 75 రోజుల పాటు నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ నిలిపివేత కారణంగా అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తు బైట్‌డాన్స్ యుఎస్ వాటాను విక్రయించడానికి లేదా ప్రభుత్వ భద్రతా చర్యలను అమలుచేయడంపై ఆధారపడి ఉంటుంది.

Read Also : Bus Ticket : అయ్యో.. భలే పనైందిగా.. బస్ కండెక్టర్ దగ్గర టికెట్ డబ్బులు మర్చిపోయారా? ఈ పనిచేయండి చాలు..!

టిక్‌టాక్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కంటెంట్ నియంత్రణ, యూజర్ల భద్రత దృష్ట్యా గ్లోబల్ ట్రస్ట్, భద్రతా బృందంలోని సభ్యులను కూడా తొలగించింది. ఈ క్రమంలోనే టిక్‌టాక్ చైనీస్ యాజమాన్యంపై 77 శాతం మంది అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 63 శాతం మంది అమెరికన్లు టిక్‌టాక్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

75 రోజుల సస్పెన్షన్ ఏప్రిల్ 2025 ప్రారంభంలో ముగియనుంది. బైట్‌డాన్స్, యుఎస్ అధికారుల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. యుఎస్ మార్కెట్లో టిక్‌టాక్ సేవలను కొనసాగిస్తుందా? లేదా షట్ డౌన్ తప్పదా అనేది త్వరలో తేలిపోనుంది.