iQOO 12 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఐక్యూ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ గేమింగ్ ఫోన్ డీల్ మీకోసమే..!

iQOO 12 Price : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ 12 ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఏకంగా రూ. 13వేలు తగ్గింది.

iQOO 12 Price

iQOO 12 Price : కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మిడ్-రేంజ్ ఐక్యూ 12 ఫోన్ ధర భారీగా (iQOO 12 Price) తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

అమెజాన్‌లో రూ. 13వేలు డిస్కౌంట్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. మొబైల్ గేమింగ్‌ ఇష్టపడేవారు అయితే ఐక్యూ 12 ఫోన్ కేవలం రూ. 45వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

గత ఏడాదిలో ఐక్యూ 12 ఫోన్ రూ. 57,999 కు లాంచ్ అయింది. అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్నాయి. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమెజాన్‌లో ఐక్యూ 12 ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో ఐక్యూ 12 ఫోన్ రూ.44,999కి అమ్ముడవుతోంది. అసలు ధర రూ.57,999 నుంచి రూ.13వేలు తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ.1,349 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Income Tax Notice : భారీగా క్యాష్ పేమెంట్లు చేస్తున్నారా? ఈ 4 ట్రాన్సాక్షన్లపై ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి జాగ్రత్త..!

నెలకు రూ.2,182 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 41,150 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు.

ఐక్యూ 12 స్పెసిఫికేషన్లు :
ఐక్యూ 12లో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, గేమింగ్ పర్ఫార్మెన్స్ Q1 గేమింగ్ చిప్‌సెట్ ఉన్నాయి. 16GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీని కూడా అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌తో 64MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.