ITR 2025-26 Major Alert
ITR 2025-26 Major Alert : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. మీకు ఆదాయపన్ను శాఖ నుంచి ఏమైనా నోటీసులు వచ్చాయా? మీరు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇమెయిల్ లేదా నోటీసులు అందుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఐటీ సందేశాలు ఎలాంటి విచారణ కోసం కాదు. పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేయడానికి మాత్రమే..
టాక్స్ పేయర్ల సమస్యలను స్వచ్ఛందంగా సరిదిద్దుకోవడానికి వారికి అవకాశం కల్పించడానికి ఉద్దేశించినవి మాత్రమేనని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఐటీఆర్‌లో అందించిన సమాచారానికి బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, విదేశీ పన్ను ఏజెన్సీల నుంచి పొందిన శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటాకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న సందర్భాలలో మాత్రమే ఈ మెసేజ్‌లు రావొచ్చు.
ఆదాయపు పన్ను శాఖ ఏం చెప్పింది?
ఈ ఐటీ మెసేజ్‌లు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే.. దర్యాప్తు లేదా విచారణ కాదని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. “ఈ కమ్యూనికేషన్లు పన్ను చెల్లింపుదారులకు శాఖ వద్ద కొన్ని లావాదేవీల గురించి సమాచారం ఉందని తెలియజేయడమే.. తద్వారా వారి వార్షిక సమాచార ప్రకటన (AIS)ను రివ్యూ చేయడం ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించగలరు” అని ఐటీ శాఖ పేర్కొంది.
ఐటీ శాఖ నుంచి ఎవరికి నోటీసులంటే? :
విదేశీ బ్యాంకు అకౌంట్లు, విదేశీ వాటాలు, మ్యూచువల్ ఫండ్లు, ESOP లేదా RSU, విదేశాల్లోని ప్రాపర్టీ, క్రిప్టో లేదా డిజిటల్ ఆస్తులు వంటి విషయాలను వెల్లడించని వారికి ఐటీ శాఖ ఈ నోటీసులను ప్రత్యేకంగా పంపుతుంది.
ఐటీఆర్‌లో ఏ విదేశీ ఆస్తులను వెల్లడించాలి? :
ITR షెడ్యూల్ FAలో ఈ కింది అన్ని విషయాలను పేర్కొనడం తప్పనిసరి. ఆ ప్రాపర్టీ నుంచి ఏదైనా ఆదాయం వచ్చిందా లేదా అనేది తప్పకుండా బహిర్గతం చేయాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే? :
నా ఆదాయం నేను చెప్పకపోతే ఏమవుతుంది? :
చార్టర్డ్ అకౌంటెంట్ నివేదికలను పరిశీలిస్తే.. “విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించకపోతే ఆదాయ చట్టం కింద రూ. 10 లక్షల వరకు పెనాల్టీ విధించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడొచ్చు. మీకు సంబంధించి ఏదైనా ఆస్తిని బహిర్గతం చేయని విదేశీ ఆస్తిగా పరిగణించవచ్చు మీరు చెల్లించాల్సిన టాక్స్ పై వాల్యూపై 30శాతం వరకు పన్ను విధించవచ్చు.”
ఏ ఐటీఆర్ ఫారం ఎంచుకోవాలి? :
విదేశీ ఆస్తుల కోసం సాధారణంగా ITR-2 లేదా ITR-3 అవసరం. ITR-1 లేదా ITR-4చెల్లవు. మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే అసలు విస్మరించవద్దు. భవిష్యత్తులో జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించేందుకు మీ ఆర్థికి నిపుణులను సంప్రదించండి. మీ ఆదాయానికి సంబంధించి సరైన సమాచారాన్ని అందించండి. మీ ITR సకాలంలో సరిచేసి మళ్లీ దాఖలు చేయండి.