ITR Deadline : ఐటీఆర్ డెడ్‌లైన్.. గడువు దాటితే అంతే.. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు..!

ITR Deadline : ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ. 1,000 జరిమానా నుంచి రూ. 5వేల వరకు జరిమానా చెల్లించాలి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులు అసలు చేయొద్దు.

ITR deadline

ITR Deadline : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ డేట్ దగ్గరపడుతోంది. గడువు తేదీలోగా మీ ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంతైనా మంచిది.

2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read Also : Apple iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోందోచ్.. కెమెరా, ధర, డిజైన్ లీక్..!

ఆర్థిక సంవత్సరం నుంచి వడ్డీ సర్టిఫికెట్లు, డివిడెండ్ స్టేట్‌మెంట్‌లు, శాలరీ స్లిప్‌లు, వ్యాపార ఆదాయ రికార్డులతో సహా అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సేకరించి దగ్గర పెట్టుకోండి.

ఐటీఆర్ గడువు తేదీ ఇదే :
2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీ గురువారం, జూలై 31, 2025. ఈ నిర్ణీత సమయంలోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే భారీగా జరిమానాలు విధించవచ్చు.

జరిమానా ఎంతంటే? :
రూ. 5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంటే రూ. 1,000 జరిమానా విధించవచ్చు. రూ. 5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ. 5వేల వరకు జరిమానా విధించవచ్చు.

ఐటీఆర్ దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆదాయపు పన్ను డాక్యుమెంట్లలో సాధారణ తప్పులు, లోపాలు లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.

దాంతో పన్నుపరమైన జరిమానాలు, ఐటీ నోటీసులు వంటివి నివారించవచ్చు. సాధారణంగా, ఐటీ రిటర్ను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు తరచుగా చేసే 5 మిస్టేక్స్ ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

1. ఐటీఆర్ దాఖలు గడువు మర్చిపోవడం :
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు తేదీ జూలై 31, 2025 అని గుర్తుంచుకోండి. ఈ గడువు దాటితే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.

ఆలస్యం అయ్యేకొద్ది చెల్లించాల్సిన జరిమానా కూడా పెరుగుతుంది. రూ. 1,000 నుంచి రూ. 10వేల వరకు జరిమానాలు విధించవచ్చు. అదనంగా, ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల పన్ను తగ్గింపులు, క్యారీ-ఫార్వర్డ్ బెనిఫిట్స్ కోల్పోతారు.

2. రాంగ్ ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం :
మీ ఆదాయానికి సంబంధించి సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి. రూ. 50 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ITR-1 ఫారమ్ ఎంచుకోవాలి. అయితే మూలధన రాబడి లేదా ఇతర ఆస్తులు ఉన్నవారు ITR-2 ఫారమ్ ఎంచుకోవాలి.

రాంగ్ ఫారమ్‌ ఎంచుకుంటే ఐటీఆర్ ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. లేదంటే మీ రిటర్న్ రిజెక్ట్ అవుతుందని గుర్తుంచుకోండి. ఫలితంగా అనవసరమైన సమస్యలతో పాటు చట్టపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

3. ఆదాయ వివరాలను పూర్తిగా చెప్పకపోవడం :
మీకు వచ్చే ప్రతి ఆదాయ మార్గాలను తప్పనిసరిగా ఐటీ శాఖకు తెలియజేయాలి. సేవింగ్స్ అకౌంట్ల నుంచి వడ్డీ, ఇతర అకౌంట్ల నుంచి వచ్చే ఆదాయం, స్థిర డిపాజిట్లు, అద్దె ఆదాయం, స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్ల నుండి వచ్చే మూలధన రాబడిని తప్పనిసరిగా పన్ను రిటర్న్‌లలో తెలియజేయాలి. ఏదైనా ఆదాయాన్ని విస్మరిస్తే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.

4. ఫారం 26AS, AIS డాక్కుమెంట్లు లేకపోవడం :
ఐటీఆర్ దాఖలు సమయంలో ఫారం 26AS, AIS డాక్కుమెంట్లు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఈ రెండు డాక్కుమెంట్లు ఆర్థిక సంవత్సరంలో తగ్గించిన పన్నులు, సంబంధిత ఆర్థిక లావాదేవీలకు చాలా ముఖ్యం. ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు సొంత రికార్డులతో వెరిఫై చేసుకోవాలి. సమాచారాన్ని చెక్ చేసి ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. తద్వారా పన్ను రిటర్న్‌ ప్రక్రియ ఆలస్యం కాకుండా చూడొచ్చు.

5. ఐటీఆర్ వెరిఫై చేయకపోవడం :
మీ ఐటీఆర్ దాఖలు చేశాక తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే.. వెరిఫై చేయని రిటర్న్‌లు వ్యాలీడ్ కాదు. ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు మీ రిటర్న్‌లను ఆన్‌లైన్‌లో ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు.

మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. సూచనల కోసం ఆదాయపు పన్ను అధికారిని లేదా సర్టిఫైడ్ టాక్స్ ఫైలింగ్ కన్సల్టెంట్‌ను సంపద్రించండి.

Read Also : New Honda Bikes : కొత్త హోండా అడ్వెంచర్ బైక్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో మీ ఫారమ్స్, అవసరమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, డివిడెండ్ స్టేట్‌మెంట్స్ తప్పనిసరిగా అటాచ్ చేయాలి.

ఈ చిన్నపాటి తప్పులు లేకుండా ఉంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు.